
ఉగాది రాగానే చాలా మందిని తొలిచేసే ప్రశ్న.. ఆదాయ- వ్యయాలు. దీనితో పాటు రాజపూజ్యం- అవమానాలు. ఏంటి ఆదాయ వ్యయాలు? ఇవి ఎక్కువ – తక్కువ ల ద్వారా మనం తెలసుకోవల్సిన నీతి ఏమిటి? అని పరిశీలిస్తే..
ఈసారి .. శ్రీ పరాభవ నామ సంవత్సర ఆదాయ – వ్యయ పట్టిక ద్వారా మేషంరాశి వారికి ఆదాయం-11, వ్యయం-5,ఇక రాజపూజ్యం-2, అవమాన-4గా ఉంది. వృషభం ఆదాయం-5, వ్యయం- 14, రాజపూజ్యం-5, అవమానం-4 కాగా.. మిథునం ఆదాయం- 8, వ్యయం-11, రాజపూజ్యం-1, అవమానం-7గా ఉంది.
కర్కాటకం ఆదాయం- 2కాగా, వ్యయం- 11గా ఉంది. ఇక రాజపూజ్యం-4, అవమానం-7గా ఉంది. సింహం ఆదాయం-5, వ్యయం-5 కాగా, రాజపూజ్యం-7, అవమానం-7గా ఉంది. కన్య ఆదాయం-8, వ్యయం-11గా ఉండగా..రాజపూజ్యం-3, అవమానం-3గా క’నిపిస్తోంది.
తుల ఆదాయం- 5, వ్యయం- 14కాగా, రాజపూజ్యం-6, అవమానం-3గా ఉంది. ఇక వృశ్చికం ఆదాయం-11 కాగా, వ్యయం-5గా ఉంది. రాజపూజ్యం-2, అవమానం-6గా క’నిపిస్తోంది. ధనుస్సు ఆదాయం-14కాగా, వ్యయం-11గా ఉంది.
రాజపూజ్యం-5, అవమానం-6గా ఉంది. మకరం ఆదాయం-2, వ్యయం-8గా ఉంది. రాజపూజ్యం-1, అవమానం-2గా ఉంది. కుంభం ఆదాయం-2, వ్యయం-8గా ఉంది. రాజపూజ్యం-4, అవమానం-2గా ఉంది. చివరిదైన మీనరాశి విషయానికి వస్తే.. ఆదాయం-14, వ్యయం-11 కాగా.. రాజపూజ్యం-7, అవమానం-2గా ఉంది.
ఆదాయం అంటే ఆ సంవత్సరంలో మనకు లభించే లాభాలు, సంపాదన లేదా కలిసొచ్చే అంశాలు. దీన్ని 2 నుంచి 14 అంకెలతో సూచిస్తారు. వ్యయం అంటే, ఆ సంవత్సరంలో మనకు ఎదురయ్యే ఖర్చులు, నష్టాలు లేదా వృధా సమయం శ్రమ. దీన్ని 2 నుండి 14 అంకెలతో కూడా సూచిస్తారు.
వీటి వెనుక తాత్పర్యం ఏంటంటే.. ఈ అంకెలు, సంఖ్యలు మన జీవితంలో ఎదురయ్యే స్థితిగతులను సూచిస్తాయి. అలాగ’ని ఆదాయం ఎక్కువ’గా ఉన్న వారు కోటీశ్వరులు కావ’డం, తక్కువ’గా ఉన్న వారు భిక్షగాళ్లు కావ’డం అని అర్ధం కాదు. ఒక్కోసారి మనకు ఆదాయం తక్కువగా ఉన్నా కూడా రాజయోగం బాగుందని.. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుందని.. ఉన్నత పదవులు సంప్రాప్తిస్తాయని రాస్తుంటారు.
దీనర్థం ఏంటంటే, వీరు శుభ’వ్య’యాలు అధికంగా చేసే అవకాశముంద’ని.. ఫర్సపోజ్ ఇల్లు కొనడం, లేదా కారు, న’గ’లు వంటి వాటికి త’మ ధనం ఖర్చు చేయడం కూడా దాగి ఉంటుంది. కాబట్టి ఆదాయం తక్కువ సంఖ్యలో ఉందని ఎక్కువ బాధ పడాల్సిన అవసరం లేదు. కాకుంటే ఎక్కువగా ఉన్న వారి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుందని అర్ధం. వారు ఏ కొనుగోళ్లు- అమ్మకాల జోలికి పోకుండా ఉంటార’ని భావించాల్సి ఉంటుంది.
ఇక రాజపూజ్య, అవమానం విషయంలోనూ ఇలాంటి అర్ధమే ధ్వనిస్తుంది. ఒకరు ఎంతగానో తీవ్ర యత్నాలు చేయడం వల్లే వారికి జయాపజయాలు సిద్ధిస్తుంటాయి. ఆ జయాపజయాలు ఏ రేషియోలో ఉంటాయో సూచిస్తాయీ అంకెలు. ఇవి 2 నుంచి 7 వరకూ ఉంటాయి. కాబట్టి, వీటిని కూడా మన మన ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయి? తద్వారా మనం ఇంకెంత శ్రమించాలి? అనే అర్ధం తీసుకోవాలి తప్ప.. ఇందులో మరెలాంటి విపరీతార్ధాలకు తావులేదు. ఇవేవీ మీ ప్రయత్నాలకు అడ్డు కాదు.
రావు, రాబోవు కూడా. ఏది ఏమైనా చేతి రాతలు, గీతలకన్నా మించింది శ్రమశక్తి. తద్వారా మనం ఎంత దూరమైనా వెళ్లొచ్చు. ఇది కేవలం ఒక ఏడాది పంచాంగం మాత్రమే. జీవితం చాలా పెద్దది. ఇంకా ఎంతో ముందుంది. ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉన్న వారు చింతించాల్సిన అవసరం కూడా ఏమీ లేదన్నది పండితుల సలహా సూచన.

C.E.O
Cell – 9866017966

