Home సినిమా ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది.. హరీష్ శంకర్ బిగ్గరగా స్టేట్‌మెంట్! – Jananethram News

ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది.. హరీష్ శంకర్ బిగ్గరగా స్టేట్‌మెంట్! – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(పవన్ కళ్యాణ్), డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్'(ఉస్తాద్ భగత్ సింగ్). ‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉగాది కానుకగా రేపు(మార్చి 19) థియేటర్లలో అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బృందం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్(హరీష్ శంకర్) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఉస్తాద్’ లాంటి సినిమా వచ్చింది చాలా కాలమైంది
అన్ని కమర్షియల్ హంగులతో నిండిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంటి సినిమా వచ్చి చాలా కాలమైందని హరీష్ శంకర్ అభిప్రాయపడ్డారు. చాలా కాలం తర్వాత ఒక బిగ్ స్టార్ నుంచి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ రాబోతోందని పేర్కొన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా, సామాన్య ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్, హెయిర్ స్టైల్, డైలాగ్ డెలివరీ, సెన్సార్ ఆఫ్ హ్యూమర్ పీక్ స్టేజ్‌లో ఉంటాయని చెప్పారు.

సినిమా నిడివి
ఎడిటింగ్ వర్క్ చాలా తక్కువగా ఉండేలా పక్కా ప్లానింగ్‌తో షూటింగ్ పూర్తి చేశామని హరీష్ చెప్పారు. ఫస్ట్ హాఫ్ సుమారు 1 గంట 12 నిమిషాలు, అలాగే సెకండ్ హాఫ్ కూడా అంతే కాంపాక్ట్‌గా ఉంటుందని వివరించారు. సినిమా మొత్తం రెండున్నర గంటల లోపే ఉంటుందని తెలిపారు. ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ సినిమా చూడాలనిపించేలా స్క్రీన్ ప్లే సెట్ చేసారు.

పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్
పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ తో బిజీ, ఆయన షూటింగ్ కు అద్భుతమైన సహకారాన్ని అందించారని హరీష్ కొనియాడారు. సమయపాలన విషయంలో పవన్ చాలా కచ్చితంగా ఉండేవారని, దానివల్ల షూటింగ్ వేగంగా పూర్తయిందని చెప్పారు. 7 గంటలకు షూటింగ్ అంటే అంతకంటే ముందే సిద్ధంగా ఉండేవారు. ఆయన సహకారం వల్లే సినిమా ఎక్కడా వేస్టేజ్ లేకుండా, చాలా ప్లాన్డ్ గా పూర్తి చేయగలిగామన్నారు.

ఇలాంటి నిర్మాతలు దొరకడం అదృష్టం
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా, తాను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారని ప్రశంసించారు. మా నిర్మాతల మద్దతు వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. ఇలాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్ళు మరిన్ని సినిమాలు తీస్తూ, పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలి.

బాలీవుడ్ మూవీ ‘ధురంధర్ 2’ తో పోటీ
ఆదిత్య ధర్ చాలా సమర్థుడైన డైరెక్టర్ అని, అయితే వారి జోనర్ వేరు, మన జోనర్ వేరని అన్నారు. ఉగాది నుండి ‘ఉస్తాద్’ హవా మొదలవుతుందని, ఇది కేవలం సినిమా రిలీజ్ మాత్రమే కాదు, ఒక సెలబ్రేషన్ అని ఆయన చెప్పారు.

రికార్డులు, కలెక్షన్ల నంబర్ గేమ్ గురించి పక్కన పెడితే, థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు “చాలా రోజుల తర్వాత ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా చూశాం” అనే తృప్తితో బయటకు వస్తారని హరీష్ శంకర్ బల్లగుద్ది చెప్తున్నారు.

మొత్తానికి హరీష్ శంకర్ మాటలు వింటుంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird