
.webp)
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల నిర్వహణలో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన న్యాయ ఘోష్ కమీషన్‌లో ఎటువంటి ఉల్లంఘనలూ లేవని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కమీషన్ విచారణలో కేసీఆర్ అండ్ కో అవకతవకలకు విచారణ జరిగిందని తేలినందునే వారు కోర్టును ఆశ్రయించారు. మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.కె.జోషిలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ధర్మానసం గురువారం (మార్చి 5) విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ జస్టిస్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కమిషన్ విచారణ ఎలా జరుగుతుందో కేసీఆర్‌కు తెలుసు. అన్నిటికీ మించి కమీషన్ నివేదికలో వారి పాత్ర గురించి తెలిసన తరువాతే వారు కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న తరువాత హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. మొత్తం మీద కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ అండ్ కోకు చిక్కులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

C.E.O
Cell – 9866017966
