Home Latest News ఖ‌మేనీ ఖేల్ ఖ‌తం… ఏక్ సైలెంట్ మొసాద్ ఆప‌రేష‌న్ | అయతుల్లా అలీ ఖమేనీ| మొసాద్| ఇరాన్| పర్షియన్| IRGC| ఇజ్రాయెల్ సైన్యం| దక్షిణ లెబనాన్| ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్| టెహ్రాన్| బీరుట్| ఇరాన్| అంతర్ జాతీయ వార్తలు| అంతర్జాతీయ సంఘం| US| క్షిపణులు| అమెరికా| ఆత్మహత్య డ్రోన్లు| పేట్రియాట్ క్షిపణి – Jananethram News

ఖ‌మేనీ ఖేల్ ఖ‌తం… ఏక్ సైలెంట్ మొసాద్ ఆప‌రేష‌న్ | అయతుల్లా అలీ ఖమేనీ| మొసాద్| ఇరాన్| పర్షియన్| IRGC| ఇజ్రాయెల్ సైన్యం| దక్షిణ లెబనాన్| ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్| టెహ్రాన్| బీరుట్| ఇరాన్| అంతర్ జాతీయ వార్తలు| అంతర్జాతీయ సంఘం| US| క్షిపణులు| అమెరికా| ఆత్మహత్య డ్రోన్లు| పేట్రియాట్ క్షిపణి – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


అయ‌తుల్లా అలీ ఖ‌మేనీని హ‌త‌మార్చ‌డానికి మొసాద్ త‌న ఆప‌రేష‌న్ ని 2020లో మొద‌లు పెట్టి.. 2026లో ముగించారు. ఇది ఎంతో ఓపిగ్గా సాగిన ఒకానొక డీపెస్ట్ క‌మ్ లాంగెస్ట్ క‌మ్ డెడ్లీ ఆప‌రేష‌న్… అదెలా సాగిందో చూస్తే..మొద‌ట డాల‌ర్లు ఇచ్చి ఖ‌మేనీ వ్య‌తిరేకులెవ‌రో వారిని మ‌చిక‌రించారు మొసాద్. వారు ఏ మొబైల్ యాప్స్ ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుంది.

ఇరాన్‌లో ప‌ర్షియ‌న్ భాష‌లో రోజూ న‌మాజు చేసే స‌మ‌యాలు, రంజాన్ లాంటి ప‌ర్వ దినాల్లో ప్ర‌త్యేక ఖురాన్ ప్ర‌వ‌చ‌నాల‌ను మెసేజీల రూపంలో పంపే యాప్‌లు చాలానే ఉన్నాయి గూగుల్ ప్లే స్టోర్‌లో. అలాంటి యాప్ ల‌లో బ‌డే స‌బా క్యాలండ‌ర్ అనే పేరుతో ఉన్న ఒక యాప్ సుమారు యాభై ల‌క్ష‌ల మంది ఇరాన్ ప్ర‌జ‌లు వాడుతున్న‌ట్టు తెలుసుకుంది మొసాద్. ఈ యాప్‌ని హ్యాక్ చేసింది. ఇది ఎవరూ కనీసం గుర్తించలేక పోయారు.

బ డే స‌బ అనే ఈ క్యాలెండ‌ర్ యాప్ షియా ముస్లింల కోసం ప‌ర్షియ‌న్ భాష‌లో రూపొందించారు. ఇది ఇస్లామిక్ క్యాలెండర్. రోజుకు ఐదు సార్లు నమాజ్ చేసే ఫజ్ర్, ఇష స‌మ‌యాల‌ను గుర్తు చేస్తూ పుష్ నోటిఫికేష‌న్ల‌ను పంపుతుంది. చిన్న అలారం సౌండ్‌తో నమాజు చేయండి అని సూచిస్తుంటుంది.అంటే కాదు మ‌త పెద్ద‌లు మ‌ర‌ణించిన రోజు, ఇత‌ర మ‌త‌ప‌ర‌మైన పండుగ‌ల‌ను సైతం గుర్తు చేస్తూ నోటిఫికేష‌న్లు పంపుతుంది బడే స‌బ యాప్.

ఇదిలా ఉంటే, ఇరాన్ లోని ట్రాఫిక్ నెట్ వ‌ర్క్ గ‌త కొంత కాలం నుంచి.. మొసాద్ ఆధీనంలో ఉంది. అవ‌స‌ర‌మైన‌పుడు ట్రాఫిక్ కెమ‌రా నెట్ వ‌ర్క్‌లో ఎక్క‌డ త‌న‌కి లైవ్ వీడియో అవ‌స‌ర‌మో అక్క‌డి లైవ్ ఫుటేజీని వాడుకుంటూ వ‌స్తోంది మొసాద్. స‌మ‌స్య ఏంటంటే ఇదే క్యాలెండ‌ర్ గూగుల్ ప్లే స్టోర్‌లో కాకుండా ఏపీకే ఫైల్స్ రూపంలో థ‌ర్డ్ పార్టీ ప్లాట్ ఫామ్స్ ద్వారా కూడా ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఎవ‌రైనా ఈ థ‌ర్డ్ పార్టీ ప్లాట్ ఫామ్స్ ద్వారా… ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకుని వాడుతుంటే దాన్ని గుర్తించి వారి మొబైల్ నుండి నెట్ వ‌ర్క్‌లోకి దూరి పోయి హ్యాక్ చేసేవారు మొసాద్ ఏజెంట్లు.

1998 నుంచ ఇజ్రాయల్ హ్యాకర్స్ ఎంతో చురుగ్గా ఉంటూ వస్తున్నారు. కాబట్టి మొసాద్ కి హ్యాకింగ్ అన్నది కొట్టిన పిండి. ఫిబ్ర‌వరి 28 శ‌నివారం ఉద‌యం.. ట్రాఫిక్ సిగ్నల్స్ ద‌గ్గ‌ర సీసీ కెమెరాలు రికార్డ్ చేస్తున్న లైవ్ దృశ్యాల‌ను చూస్తున్న మొసాద్ ఏజెంట్స్ కి సుప్రీం లీడ‌ర్ ఆయ‌తుల్ల ఖ‌మేనీని క‌ల‌బ‌న్ గ‌మ‌న‌కు వెళ్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొద‌ల‌య్యే స‌మ‌యం కాబ‌ట్టి.. వారు ఖ‌మేనీతో అత్య‌వ‌స‌ర స‌మావేశం కోస‌మే వెళ్తున్నారు.

అప్ప‌టికే ఇరాన్‌లో ఇంట‌ర్నెట్ స్పీడు త‌గ్గిపోయి ఉండ‌టం వ‌ల్ల.. టెక్స్ట్ మెసేజీలు మాత్ర‌మే మొబైల్ ఫోన్‌లకు వ‌స్తున్నాయి. తప్పితే వీడియో, ఫోటోలు రావటం నిలిచిపోయాయి. IRGC సైబర్ సెక్యూరిటీ విభాగం, ఇంట‌ర్ నెట్ ఎందుకు స్లో అయిందో ప‌రిశీలించ‌గా.. అంతా బాగానే ఉంది కానీ, ఎందుకు స్లో అయిందో గుర్తించ‌లేదు.

శనివారం ఉదయం 10:08 నిముషాలకి ఇరాన్ లో బడే సబ్ యా వాడుతున్న అందరికీ ఒక పుష్ నోటిఫికేషన్ వచ్చింది హెల్ప్ అరైవ్డ్ అని. ఈ హెల్ప్ అరైవ్డ్ అనే నోటిఫికేష‌న్ వ‌చ్చే స‌మ‌యానికి ఖ‌మేనీ నివాసం మీద ఎయిర్ టు స‌ర్పేస్ మిస్సైల్ దాడి జ‌రిగి భ‌వ‌నం పూర్తిగా కుప్ప కూలిపోయింది. ఖ‌మేని మ‌ర‌ణించిన‌ట్టు నిర్ధారించిన త‌ర్వాత మ‌రో పుష్ నోటిఫికేష‌న్ 10. 14 నిమిషాలకు వ‌చ్చింది.

అదెలాంటిదంటే, ఇరాన్ ప్రజలని క్రూరంగా హింసించి హత్య చేసిన ప్రభుత్వం మీద పగ తీర్చుకునే సమయం వచ్చేసింది. ఇప్పటికే మీ దగ్గర ఆయుధాలు ఏవన్నా ఉంటే వాటిని వదిలేసి వచ్చి.. IRGC మీద పోరాడడానికి మాతో వస్తే మీకు క్షమాభిక్ష పెడతాము.. అన్నది ఈ మెసేజ్ సారాంశం. ఈ మెసేజ్ వచ్చిన సమయానికి అమెరికన్, ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ టెహ్రాన్ నగరం బయట గగనతలంలో ఎగురుతోంది. ఖ‌మేనీ తన భవనంలోనే ఉన్నార‌ని నిర్ధారించుకున్న‌మ‌రు క్షణమే మిస్సైల్స్ ప్ర‌యోగించ‌డం, అదే స‌మ‌యంలో మొబైల్ ఫోన్‌ల కి మెసేజ్‌లు పంపడం ఒకే సారి జరిగింది.

IRGC లో మోసాద్ కి ఎజెంట్స్ ఉన్నారన్నది చాలా పాత విషయం. ఖమేనీ తన నివాసంలో ముఖ్యులతో ఉన్నాడని ఖమేనీ నివాసంలోని వాళ్లలో ఎవరో సమాచారం ఇచ్చారు. సదరు సమాచారం ఇచ్చిన వ్యక్తి మీసైల్ దాడిలో చనిపోయి ఉంటాడు. ఇందుకే ఆశ్చర్య పోవల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఒక్క ఖమేనీని చంపడం కోసం మొసాద్ చాలానే ప్లాన్ చేసింది. ఎన్నో ప్రాణాల‌ను ఖ‌మేనీ ప్రాణాల‌కు బ‌లి ఇవ్వాల్సి వ‌చ్చింది.

ఈ ఖ‌మేనీ ఖ‌తం ఎపిసోడ్ క‌న్నా ముందు ఇరాన్‌లో ఎన్నో ప్రాణాలు పోవ‌డానికి కార‌ణం మొసాద్. మొసాద్ త‌న‌దైన హ్యాకింగ్ తెలివి తేట‌ల‌తో బ‌డే స‌బ వంటి యాప్‌ల ద్వారా కొన్ని రెచ్చ‌గొట్టుడు మెసేజీల‌ను పాస్ చేసింది. అది కూడా ఖ‌మేనీ వ్య‌తిరేఖ‌లకు. వారు ఈ మెసేజీలకు రెచ్చి పోయి రోడ్ల మీదకు వచ్చేవారు. వారిని ఖమేనీ ప్రభుత్వం హతమార్చేసేది. వీరి సంఖ్య కొన్ని వేలకు చేరింది. దీనితో ఖ‌మేనీకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఖ‌మేనీ ప‌ట్ల ఒక ర‌క‌మైన వ్య‌తిరేఖ భావ‌న వ‌చ్చింది. ఇదే అదనుగా భావించిన మొసాద్ త‌న టార్గెట్ ఫిక్స్ చేసింది. ఖ‌మేనీ ఖేల్ ఖ‌తం చేసింది. దటీజ్ మొసాద్ కా మెసేజ్ ప‌వర్!

సిట్యువేషన్ ని కంట్రోల్‌లోకి తీసుకోవటం మాత్రమే కాదు, త‌మ‌కు కావాల్సిన సిట్యువేష‌న్ క్రియేట్ చేయ‌డంలో కూడా ఆరితేరిపోయింది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్. అందుకే తాజాగా మరో ప్ర‌క‌ట‌న కూడా చేసింది.. ఇజ్రాయెల్. ప్ర‌స్తుతం ఇరాన్ సుప్రీం లీడ‌ర్ గా ఖ‌మేనీ రెండో కుమారుడు మ‌జ్త‌బాను ఎంపిక చేసింది. అయితే ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఎవ‌రైతే వారు త‌మ టార్గెట్ అయిపోతార‌ని అన్నారు ఇరాన్ ర‌క్ష‌ణ మంత్రి..కాట్జ్. ఇది మ‌న క్లియ‌ర్ టార్గెట్ అంటూ ఇప్ప‌టికే ఆయ‌న త‌మ భ‌ద్ర‌తా ద‌ళ‌మైన ఐడీఎఫ్ కి ఆర్డ‌ర్లు పాస్ చేసారు. అంటే కొత్త సుప్రీం లీడ‌ర్ డెత్ స‌ర్టిఫికేట్ కూడా రెడీ అయిపోయింద‌న్న‌మాట. అదీ మొసాద్ అంటే.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird