
కాకినాడ జిల్లా సామర్ల కోట సమీపంలోని వేట్ల పాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 18 మంది మరణించారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వెట్లపాలెంలోని ఓ బాణాసంచ తయారీ కేంద్రం శనివారం (ఫిబ్రవరి 28) ఈ పేలుడు సంభవించింది.
అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. పేలుడు శబ్దం దాదాపు 5 దూరం వరకూ వినిపించింది. వేట్లపాలెం గోదావరి కెనాల్‌లోని ఓ బాణాసంచా పక్కన భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. పేలుడు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు.

C.E.O
Cell – 9866017966
.webp)
