

తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ శుక్రవారం (ఫిబ్రవరి 27) కన్నుమూశారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో గత కొంత కాలంగా ఆనారోగ్యంతో తీసుకుంటున్న సౌందర్ రాజన్ శుక్రవారం (ఫిబ్రవరి 27) ఉదయం తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
అర్చక సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నత విద్యను అభ్యసించిన ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ స్థాయికి ఏడుగురు. ఆయన కుమారులలో రెండో వారైన రంగరాజన్ ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు. సౌందర్‌రాజన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ స్వామివారి సేవలో అంకితభావంతో పనిచేసిన సౌందర్ రాజన్ గారు భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

C.E.O
Cell – 9866017966
