*జననేత్రం న్యూస్ భద్రాచలం నియోజకవర్గం ప్రతినిధి జులై15*//:లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సను లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వెంకట్ తో కూడిన వైద్యులు సిబ్బంది విజయవంతంగా నిర్వహించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం నాడు తన ఛాంబర్ లో లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స విజయవంతంగా నిర్వహించిన డాక్టర్లను ఆయన శాలువాలతో సత్కరించిన అనంతరం మాట్లాడుతూ బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన పేరు మాల్ల రమణకు పిత్తాశయంలో రాళ్లు ఉండడంతో రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యే శస్త్ర చికిత్సను చేయించుకునే స్తోమత లేకపోవడంతో వారు ఏరియా వైద్యశాల పర్యవేక్షకుడు రామకృష్ణను సంప్రదించగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద తొలి లాప్రోస్కోపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించగా అది విజయవంతమైనట్లు ఆయన అన్నారు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో నివసించే అమాయక గిరిజనులు సరియైన అవగాహన లేక ఇటువంటి భయంకరమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారని, అందుకు వైద్య సిబ్బంది అటువంటి వారిని గుర్తించి తప్పనిసరిగా వైద్య సేవలు అందించాలని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయని అందుకు ఏరియా ఆసుపత్రిలో పనిచేసే డ్యూటీ డాక్టర్లు 24 గంటలు ఆస్పత్రిలో ఉండే రోగులకు వైద్య సేవలు అందించాలని, గోదావరి వరదలు కూడా పెరగవచ్చని ముంపు ప్రాంతాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు చేసే ఇప్పటినుండి ప్రణాళికలు రూపొందించుకోని సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చైతన్య, ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు రామకృష్ణ, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ వెంకటరాజ్, డాక్టర్ నికిత తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
