*జననేత్రంన్యూస్.దౌల్తాబాద్ మండలం ప్రతినిధిజూన్23*//:దౌల్తాబాద్, జిల్లా స్థాయి క్రీడా పాఠశాలకు ఎంపిక అవడం చాలా ఆనందదాయకం, మండల విద్యాధికారి గజ్జల కనకరాజు దౌల్తాబాద్ సమక్షంలో బాలుర ఉన్నత పాఠశాల నందు స్పోర్ట్స్ కోటాలో నాలుగవ తరగతిలో ప్రవేశాలపై శారీరక సామర్ధ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.
ఈ పరీక్షలలో ప్రాథమిక పాఠశాల ఉప్పరపల్లి కి చెందిన ముగ్గురు విద్యార్థులు జి నిహాల్, ప్రియ,మణికంఠ, ఎంపిక కావడం జరిగింది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కూడా ఎంపిక పరీక్షలు నిర్వహించబడతాయి.
తదుపరి రాష్ట్రస్థాయి క్రీడ పాఠశాలకు ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జల కనకరాజు, ఫిజికల్ డైరెక్టర్ విష్ణు, మరియు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.


C.E.O
Cell – 9866017966
