జననేత్రం.న్యూస్.ఉమ్మడిఖమ్మంజిల్లాబ్యూరో.జూన్22://: మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్‌పెక్టర్ మోహన్ బాబు పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఖమ్మం త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రకాష్ నగర్ లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగాఇన్స్‌పెక్టర్ మాట్లాడుతూ…మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరికీ సమగ్ర అవగాహన అవసరమని అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం అనేది వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబం, సమాజం మరియు దేశం పైన కూడా ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేసుకోకుండా నైతిక విలువలు అలవర్చుకొని ఉజ్వలభవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు.



C.E.O
Cell – 9866017966
