*జననేత్రం న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జూన్17*//: యాదాద్రి భువనగిరి జిల్లా మాదిగలు సామాజికంగాఆర్థికంగాఎదగలి 9%రిజర్వేషన్లుఉపయోగించుకొని విద్యా ఉద్యోగ రంగాల్లో మాదిగలు రాణించాలి. ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ బిర్రు మహేందర్ మాదిగ.
వివరణ:- తరతరాలుగా వివక్షతకు గురైన మాదిగలు ఇప్పుడిప్పుడే రాజ్యాంగ ఫలాలను ఎస్సీ వర్గీకరణ ద్వారా పొందుతున్నారని, ఇకపై సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ఎదగడానికి ముందకు నడవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ బిర్రు మహేందర్ మాదిగ అన్నారు.
యాదగిరిగుట్ట మండలం యాదాద్రి పట్టణంలో MRPS ముఖ్య కార్యకర్తల సమావేశం ఎమ్మార్పియస్ మండల ఇంచార్జీ బూడిద జానీ మాదిగ అధ్యక్షతన జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ బిర్రు మహేందర్ మాదిగ పాల్గొని వారు మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణ అమలులో లేకపోవడం వల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మాదిగలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.మాదిగల పక్షాన దండోరా ఉద్యమాన్ని ప్రారభించి ముప్పై ఏళ్లుగా రాజీలేని పోరాటాన్ని నడిపించి నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయించిన ఘనత ఎమ్మార్పియస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ కే దక్కుతుందని అన్నారు.నేడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో 9% రిజర్వేషన్లు మాదిగలకు దక్కాయని అన్నారు.కావున మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు 9% రిజర్వేషన్లు అందిపుచ్చుకొని విద్యా, ఉద్యోగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.ఎస్సీ వర్గీకరణ స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి సమాజంలోని అన్ని కులాల వారు తమ మద్దతును తెలిపి అండగా ఉన్నారని ఉన్నారు.కావున ఎమ్మార్పియస్ ఉద్యమానికి శ్రేయోభిలషులుగా ఉన్న వారి పట్ల కృతజ్ఞతగా ఉంటామని అన్నారు .అందులో భాగంగా జూలై 7 న ఎమ్మార్పియస్ 31 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాల్లో సభలు పెట్టి అన్ని కులాల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సత్కారం చేస్తామని అన్నారు.జూలై 7 న అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఎమ్మార్పియస్ జెండాలను ఆవిష్కరణ చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో
ఎంఎస్పీ జాతీయ నాయకులు మంద శంకర్ మాదిగ,
ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ,
ఎమ్మార్పియస్ మండల ఇంచార్జీ ఎంఎస్పీ జిల్లా నాయకులు బూడిద జానీ మాదిగ, ఎమ్మార్పియస్ మండల అధ్యక్షులు ఆకారపు లక్ష్మీనారాయణ మాదిగ, నియోజకవర్గ నాయకులు జెర్రిపోతుల కరుణాకర్ మాదిగ, మండల అధికార ప్రతినిధి వద్దిగాళ్ల రాజు మాదిగ, సుంచు బాబు మాదిగ,సుంచు సిద్దు మాదిగ,జంగ మచెందర్ మాదిగ, బూడిద సాయి తేజ మాదిగ తదితరులు పాల్గొన్నారు.



C.E.O
Cell – 9866017966
