Home Latest News రిటైర్డ్ సబ్ కలెక్టర్ పొట్ట పెంజర్ రాజారావు జీవితం నేటి సమాజంలోని యువతకు ఎంతో ఆదర్శనీయంఎంఎస్పి జాతీయ కమిటీ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ

రిటైర్డ్ సబ్ కలెక్టర్ పొట్ట పెంజర్ రాజారావు జీవితం నేటి సమాజంలోని యువతకు ఎంతో ఆదర్శనీయంఎంఎస్పి జాతీయ కమిటీ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ

by Jananethram News
0 comments

*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చ్ 28*//:ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం మండల పరిధిలోని చిన్న పల్లెటూరైన చిన్న మారుమూల గ్రామం ఇనగాలి గ్రామంలో 1947లో పొట్ట పెంజర లక్ష్మయ్య దీనమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించిన ఆణిముత్యం మట్టిలో మాణిక్యం పొట్ట పెంజర రాజారావు జీవితం నేటి సమాజ యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని ఎంఎస్పీ జాతీయ నాయకులు వంగూరి ఆనందరావు మాదిగ తెలియజేసినారు నేడు ఆయన అకాల మరణం ఆ కుటుంబానికి నేటి సమాజానికి తీరని లోటని స్పష్టం చేసినారు ఆయన బాల్య అభ్యాసం సొంత గ్రామం ఇనగారలి లోనే జరిగిందని బాల్య అభ్యాసం అనంతరం పై చదువుల కొరకు పక్క గ్రామమైన మర్లపాడు లో పదవ తరగతి వరకు చదువుకొని ఆ పై చదువుల కోసం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాలవొడ్డు ప్రాంతంలోని నయాబజార్ జూనియర్ కాలేజీలో జరిగిందని ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే టైపిస్టు ఉద్యోగం చేస్తూ నైట్ కాలేజీలో చేరి ఎస్ఎన్ఆర్ బిజె ఎన్ ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసినారు వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పిజిఎం కం అయిన తర్వాత లా చేసినారు పై చదువులు చదివిన అనంతరం కొంతకాలం ఎల్ఐసి లో పనిచేసి బ్యాంకు మేనేజర్ గా కూడా పనిచేశారు అనంతరం చదివిన చదువులను బట్టి మండల తాసిల్దారుగా ఆనాటి కాలంలోనే ఉన్నత ఉద్యోగాన్ని పొందగలిగినారు రాజారావు తాసిల్దారుగా మొదట బూర్గంపాడు మండలం తదుపరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం తిరుమలాయపాలెం సత్తుపల్లి పెనుబల్లి మండలాల్లో తాసిల్దారుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినారు అనంతరం ఆర్డీవో గా సూర్యాపేట జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ తదుపరి పి ఆర్ ఓ గా ఖమ్మం జిల్లా కేంద్రంలో చేసినారు డిఆర్డిఏ మేనేజర్ గా ఎస్సీ కార్పొరేషన్ ఖమ్మం మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించినారు సబ్ కలెక్టర్ గా వరంగల్ జిల్లాలో నిర్వహించినారు డిఆర్ఓగా నల్గొండ జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ రిటైర్ అయినారు పొట్ట పెంజర రాజారావు ఉన్నత కుటుంబంలో జన్మించ నప్పటికీ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా జీవనం కొనసాగిస్తున్న ఆనాటి కాలంలోనే వారికి వ్యవసాయ పనుల్లో వారు చేసే వ్యాపార వృత్తిలో చిన్నతనం నుండే తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవాడని తెలియజేసినారు రాజారావుకు భార్య రాజశ్రీ మణి కుమారుడు పొట్ట పెంజర ప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి కలరు రాజారావు ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి తన సామాజిక వర్గానికి మొదటి నుండి చేదోడువాదోడుగా ఎంతో సహకారంగా నిలిచినాడని అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరించడంలో ముందడుగులో ఉండేవాడని తను నమ్ముకున్న నీతి న్యాయ సిద్ధాంతాలకు ఏనాడు వెనక్కి రాని వ్యక్తిగా ముందు వరుసలో నిలిచినారని ఉద్యోగ బాధ్యతల్లో ఎన్ని ఉన్నత ఉద్యోగాలు బాధ్యతలు నిర్వహించినప్పటికీ ఆ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఏనాడు చిన్న రిమార్కు లేనటువంటి మచ్చలేని వ్యక్తిగా తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహించినారు అని తెలియజేసినారు రాజారావు భౌతికకాయాన్ని ఖమ్మంలో తన సొంత గృహములో సందర్శించి ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి రాష్ట్ర జిల్లా మండల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసినారు నివాళులర్పించిన వారిలో ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు కనకం జనార్దన్ మాదిగ ఖమ్మం పట్టణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బాకీ శ్రీనివాస్ మాదిగ ఖమ్మం రూరల్ మండలం మ హజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు సిరిపురం బొందయ్య మాదిగ తదితరులు ఉన్నారు

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird