Home Latest News మీరు ఇంటి మీదకు వచ్చి అడిగే హక్కు ఉందా?

మీరు ఇంటి మీదకు వచ్చి అడిగే హక్కు ఉందా?

by Jananethram News
0 comments

మందా సైదులు
సిపిఎం మధిర మండల కార్యదర్శి. *జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చ్27*//:మధిర మండలంలోని పలు గ్రామాలలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు వాయిదాలు చెల్లించమని ఇంటి మీదకు పదేపదే వెళ్లి నలుగురు ఐదుగురు కలిసి ఒత్తిడి చేసే హక్కు ఉందా అని ప్రశ్నించారు?

ఈరోజు స్థానిక ఎంప్లాయిస్ కాలనీ నందు కొంగల జ్యోతి అను గృహిణి మధిర పట్టణంలోని ఐరిప్ ఫైనాన్స్ బ్యాంక్ నుండి గత 17 నెలల క్రితం లోన్ తీసుకున్నారు. ఇప్పటివరకు 15 వాయిదాలు చెల్లించారు. 16వ వాయిదా చెల్లించటానికి కొద్ది రోజులు టైం అడిగారు. ఒప్పుకొని ఐరెడ్ బ్యాంక్ సిబ్బంది వారి ఇంటి మీదకు వెళ్లి డబ్బులు వెంటనే చెల్లించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు. పదేపదే ఫోన్ కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ఆమె కొడుకు అయిన కొంగల దీపక్ ను మీరు చనిపోయిన పర్వాలేదు మా డబ్బులు కట్టండి అంటూ ఇబ్బంది పెడుతున్నారని, ఇంటి మీదకు వచ్చి పరువు తీస్తున్నారని సమస్య తెలుసుకొనేందుకు వెళ్లిన సిపిఎం పార్టీ బృందం ముందు తమ కష్టాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా IReep ప్రైవేట్ ఫైనాన్స్ యాజమాన్యంతో చర్చల సందర్భంగా కొంగల జ్యోతి కుటుంబం ఒక్క నెల మాత్రమే వాయిదా చెల్లింపుకు రెండు రోజుల సమయం అడిగిందని. తమకు టార్గెట్ సకాలంలో పూర్తి కావాలని ఇంటి వద్దకు వచ్చి అడుగుతున్నామని సదరు ఫైనాన్స్ సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా మందా సైదులు మాట్లాడుతూ ఫైనాన్స్ కంపెనీలకు వినియోగదారుల ఇంటి మీదకు వెళ్లే హక్కు లేదని, పదేపదే ఫోన్ చేసి
వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి చేసే హక్కు లేదని,
అప్పు ఉన్న విషయం బహిరంగంగా వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించడం అవుతుందని అన్నారు.
వినియోగదారులు సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే వారికి కంపెనీలు అపరాధ రుసుములు వసూలు చేస్తున్నాయని వాయిదాలు చెల్లించడంలో జాప్యం జరిగితే దానికి ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఆ మేరకు సంస్థలకు లాభం జరుగుతుంది. అయినప్పటికీ ఫైనాన్స్ కంపెనీల వేధింపులుపెరుగుతున్నాయి.తట్టుకోలేని వినియోగదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వేధింపులు వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన అమౌంట్ ని చట్ట ప్రకారం వసూలు చేసుకునే హక్కు కలిగి ఉన్న కంపెనీలు చట్టాన్ని ధిక్కరించడం సరైనది కాదని అన్నారు. ఈ వేధింపులపై పోలీస్ శాఖ జోక్యం చేసుకొని హరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు తేలపోలు రాధాకృష్ణ మండల నాయకులు వడ్రానపు మధు మరియు ఇతరులు పాల్గొన్నారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird