*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమార్చ్16*//:వంగూరి ఆనందరావు మాదిగ ఎంఎస్పీ జాతీయ నాయకులు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఏ బి సి లు కాకుండా ఏబిసిడిలుగా వర్గీకరించాలని జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ప్రత్యేకించి మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని మూడు ప్రధాన డిమాండ్లతో ఈ నెల 9వ తేదీన ఖమ్మం రూరల్ మండలం కార్యాలయం ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ మండల కమిటీల ఆధ్వర్యంలో మందకృష్ణ మాది గ ఆదేశాల మేరకు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించటం జరిగినది నేటికీ ఎనిమిదో రోజుకు చేరుకున్న ఈ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఈదలాపురం ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు పొన్నగంటి చక్రి మాదిగ శిబిరంలో దీక్షలకు కూర్చున్న గ్రామ కమిటీ నాయకులు కార్యకర్తలకు పూలమాలలు వేసి నేటి దీక్ష శిబిరాన్ని ప్రారంభించినారు ఈ దీక్ష శిబిరానికి ఎంఎస్పీ జాతీయ నాయకులు ఒంగూరు ఆనందరావు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించక ముందే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద ఉద్యోగ నియామకాలు చేపట్టి మాదిగలకు పూర్తిస్థాయిలో అన్యాయం చేస్తూ మాలలకు ఉద్యోగ అవకాశాలను పూర్తిస్థాయిలో కట్టబెట్టడానికే ముందుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినారు ఎస్సీ వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించకుండా నేడు ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మాదిగలకు తీరని అన్యాయానికి ఓడి కట్టడమే తప్ప మరొకటి కాదని స్పష్టం చేసినారు రాష్ట్రంలో దేశంలో ఎస్సీ వర్గీకరణ జీవో చట్టబద్ధత అమలు కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రాష్ట్రంలో దేశంలోని మాదిగ మాదిగ ఒప్పుకోలాల ప్రజలు ఈ దేశంలో ఉన్న పార్టీలు ప్రజా సంఘాలు కుల సంఘాలను అందరి మద్దతును కూడగట్టి అందరి సహాయ సహకారాలతో ఈ భారత దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా ఎస్సీ వర్గీకరణ జీవో అమలు సమంజసమే ఇది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అవసరాల మేర కు వర్గీకరణ చేసుకోవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రంలో వర్గీకరణ జీవోకు చట్టబద్ధత కల్పించక ముందే ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టి మాలల అభివృద్ధికి దోహదపడటానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది తప్ప మాదిగలకు మేలు చేయటానికి కాదని స్పష్టంగా తెలియజేసినారు రాష్ట్రంలో మాదిగ మాదిగ ఉప కులాల ప్రజలను ఉద్యోగ అవకాశాలకు దూరం చేసి కేవలం మాలల ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం తలకి మాత్రమే ఈ ఉద్యోగ నియామకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టడం జరిగిందని ఇట్లాంటి పరిస్థితులను రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల ప్రజలు ప్రజా సంఘాలు కుల సంఘాలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మూడు దశాబ్దాల ఉద్యమ పోరాట ఫలితాలను అందుకోవాల్సిన పరిస్థితుల్లో అధినేడు అందని ద్రాక్షాలనే మిగిలిపోవడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసినారు రాబోయే కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పటం ఖాయమని ఈ సందర్భంగా ఆనందరావు మాదిగ హెచ్చరించారు నేడు దీక్ష శిబిరంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సీనియర్ నాయకులు కనకం జనార్దన్ మాదిగ బోయిన కృష్ణ మాదిగ ఖమ్మం రూరల్ మండలం మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు సిరిపురం బొందయ్య మాదిగ నగర కమిటీ అధ్యక్షులు బాకీ శ్రీను మాదిగ వంగూరి రమేష్ మాదిగ ఎదలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు మామిడాల కిరణ్ మాదిగ గ్రామ కమిటీ పెద్దలు చెరుకుపల్లి ఉపేంద్ర మాదిగ నారపాటి వెంకటేశ్వర్లు మాదిగ నవెల ఎల్లయ్య మాదిగ బండ్ల వేణు మాదిగ పొన్నెకంటి గోపి మాదిగ నారపాటి ఇశాంత్ మాదిగ కొలకపొంగు సుధాకర్ మాదిగ నారపాటి పార్థసారథి మాదిగ మందుల అభిలాషు మాదిగ పాత కోటి కళ్యాణ్ మాదిగ మేళ్లచెరువు వెంకటేశ్వర్లు మాదిగ తదితరులు జొన్నలగడ్డ మునిసి మాదిగ ఎమ్మార్పీఎస్ ముదిగొండ మండల సీనియర్ నాయకులు పాల్గొన్నారు



C.E.O
Cell – 9866017966
