జననేత్రం న్యూసు ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి 22*//:ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా నోట్ బుక్స్ మరియు విద్యాసామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తి పాల్గొనడం జరిగింది. డా.దివ్యమూర్తి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జగ్గిలాల్, హరిప్రసాద్, అభిమానుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరేపల్లి జ్ఞానరత్నం, కందుల ప్రభాకర్, అర్జున్, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.


C.E.O
Cell – 9866017966
