
జగన్ కి మళ్లీ మూడొచ్చింది. మొన్నటి వరకూ కర్నూలు- అమరావతి- విశాఖ అంటూ మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడిన జగన్ ఇప్పుడు మరో మూడు ముక్కలాటకు తెరతీశారు. అదే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. దీనికే ఆయన సినిమా ఫక్కీలో మావిగన్ అంటూ జగన్ అనే అర్ధమొచ్చేలా పేరు పెట్టారు.
పేరు వరకూ ఓకే… ఇప్పటి వరకూ ఆయన అన్నమాటలను ఒకసారి పరిశీలిస్తే తనకే సంకుచితమైన మనస్తత్వమే ఉంటే అమరావతిని ఎందుకు లెజిస్లేటివ్ క్యాపిటల్ చేస్తాను? అక్కడే స్థలం కొన్ని ఇల్లెందుకు కడతాను? తానే కదా మొదట అమరావతిలో ఇల్లు కట్టుకుంది అన్నారు. తనకే సంకుచిత మనస్తత్వమే ఉండి ఉంటే, రాయలసీమలోనే రాజధాని కట్టేవాడ్ని కదా? అని కూడా ప్రశ్నించారు. తనకెలాంటి సంకుచిత మనస్తత్వం లేదు కాబట్టే.. తాను విశాఖ రాజధాని కావాలని కోరుకున్నట్టు చెప్పారు మావిగన్ రూపశిల్పి జగన్.
జగన్ తన ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన కామెంట్లు చేశారు. అందులో మొదటిది.. వాళ్లేవిధంగా అసెంబ్లీలో అమరావతే రాజధాని అని ఒక చట్టం చేశారో.. మాకు అధికారం వస్తే, అదే అసెంబ్లీని వేదికగా చేసుకుని.. ఆ చట్ట సవరణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు? అలా ప్రశ్నించడం ద్వారా తానేమిటో.. తన విధానమేమిటో క్లారిటీ ఇచ్చారు.
మొన్నటి వరకూ విశాఖ విశాఖ అన్న జగన్.. ఇప్పుడు అమరావతిని కొత్త రాజధాని కారిడార్లో భాగంగా మచిలిపట్నం, విజయవాడ, గుంటూరును చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. మరి విశాఖ మీద ఆయనకున్న ప్రేమ ఏమైనట్టు? మరో పక్క బొత్స, ధర్మాన ద్వారా ఈ బిల్లును తిరిగి తాము బ్రేక్ చేయగలమని కూడా చెబుతున్నారు. అంటే ఎవర్ని ఎవరిపైకి ఎందుకు ఉసిగొల్పుతున్నారు?
దీనంతటిని బట్టి చూస్తుంటే అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణం జరగడానికి వీల్లేదని జగన్ బలంగా కోరుకుంటున్నారని ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. అందుకే మావిగన్ అంటూ పిచ్చి ప్రతిపాదనలు, ప్రేలపనలు చేస్తున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఈ వైఖరితో జగన్ పార్టీ వచ్చే ఎన్నికలలో 11 నుంచి ఒక్కటి పడిపోయినా ఆశ్చర్యంలేదంటున్నారు. నలభై శాతం ఓటు బ్యాంకు అంటున్న జగన్ కు ఆ ఓటు శాతం నాలుగుకు పడిపోయేదాకా నిద్రపట్టదా ఏంటని ఎద్దేవా చేస్తున్నారు నెటిజనులు.

C.E.O
Cell – 9866017966

