Home Latest News తమిళనాడు ఎన్నికలు…అన్నాడీఎంకే తొలి జాబితా విడుదల | ఏఐఏడీఎంకే తొలి జాబితా విడుదల | తమిళనాడు ఎన్నికలు | అభిప్రాయ సర్వే | MK స్టాలిన్ | డీఎంకే కూటమి | మక్కల్ నీది మైయం | ద్రావిడ మోడల్ 2.0 | తమిళనాడు రాజకీయాలు | 2026 అసెంబ్లీ ఎన్నికలు | టార్చ్ లైట్ సింబల్ | రాజకీయ మద్దతు | TVK పార్టీ | సీఎం స్టాలిన్ | పళనిస్వామి | BJP | సిపిఐ | CPM | విజయ్ | NDA – Jananethram News

తమిళనాడు ఎన్నికలు…అన్నాడీఎంకే తొలి జాబితా విడుదల | ఏఐఏడీఎంకే తొలి జాబితా విడుదల | తమిళనాడు ఎన్నికలు | అభిప్రాయ సర్వే | MK స్టాలిన్ | డీఎంకే కూటమి | మక్కల్ నీది మైయం | ద్రావిడ మోడల్ 2.0 | తమిళనాడు రాజకీయాలు | 2026 అసెంబ్లీ ఎన్నికలు | టార్చ్ లైట్ సింబల్ | రాజకీయ మద్దతు | TVK పార్టీ | సీఎం స్టాలిన్ | పళనిస్వామి | BJP | సిపిఐ | CPM | విజయ్ | NDA – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఎన్నికల బరిలోకి దిగుతూ తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 23 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి ప్రకటించారు. ఈ జాబితాలో అనుభవజ్ఞులైన నేతలకు, ముఖ్యంగా మాజీ మంత్రులకు పార్టీ పెద్దపీట వేయడానికి.

ఈ తొలి జాబితాలో అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత గడ్డ అయిన ‘ఎడప్పాడి’ నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేయనున్నారు. 23 మంది అభ్యర్థులలో ఏకంగా 21 మంది మాజీ మంత్రులు ఉండటం విశేషం. తమకున్న అనుభవం, నియోజకవర్గాలపై పట్టును దృష్టిలో ఉంచుకుని పాత వారికే ఈపీఎస్ మొగ్గు చూపారు. డీ జయకుమార్ రాయపురం నుంచి, సీవీ షణ్ముగం మైలం నుంచి, ఎస్పీ వేలుమణి తొండముత్తూరు నుంచి బరిలోకి దిగుతున్నారు.

ముఖ్య నేతల విషయానికి వస్తే.. కేపీ మునుసామి వేపనహళ్లి నుంచి, దిండిగల్ శ్రీనివాసన్ దిండిగల్ నుంచి, నాథమ్ విశ్వనాథన్ నాథమ్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ మంత్రులు సెల్లూరు రాజు (మదురై వెస్ట్), సి. విజయభాస్కర్ (విరాలిమలై), ఓఎస్ మణియన్ (వేదారణ్యం) తమ పాత నియోజకవర్గాల నుంచే అదృష్టాన్ని పరీక్షించనున్నారు. మెజారిటీ నేతలు తమ పాత స్థానాల్లోనే కొనసాగుతుండగా, ముగ్గురు మాజీ మంత్రుల నియోజకవర్గాలను మాత్రం పార్టీ మార్చింది.

అన్నాడీఎంకే కూటమి లెక్కల ప్రకారం ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే సింహభాగం స్థానాల్లో అంటే సుమారు 178 స్థానాల్లో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎమ్‌ఎంకేకు 11 స్థానాలు దక్కాయి. డీఎంకే కూటమిని గద్దె దించడమే బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు పళనిస్వామి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

తమిళనాడు వ్యాప్తంగా ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ మార్చి 30 నుంచి ప్రారంభం కాన, మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపికను పార్టీ వేగవంతం చేసింది. మరో రెండు రోజుల్లో రెండో జాబితా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రులపై భారం వేసిన అన్నాడీఎంకే, ఈసారి అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉంది.మే 4వ తేదీన విడుదలైన ఫలితాలు తమిళనాడులో ఎవరికి పట్టం కడతాయో వేచి చూడాలి. ప్రస్తుతం అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని అప్పుడే ప్రారంభించారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird