Home సినిమా పాకిస్థాన్ లో ఏడేళ్లు బిచ్చగాడిలా బతికిన అసలైన ధురంధర్ – Jananethram News

పాకిస్థాన్ లో ఏడేళ్లు బిచ్చగాడిలా బతికిన అసలైన ధురంధర్ – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


-రికార్డు కలెక్షన్స్ లలో ధురంధర్ 2
-అసలు ధురంధర్ ఎవరు
-1980లో అజిత్ దోవల్ చేసింది ఏంటి

చూస్తుంటే ధురంధర్ 2(ధురంధర్ 2)కలెక్షన్స్ ల ప్రవాహం ఇప్పట్లో ఆగేలా లేదు. బాక్స్ ఆఫీస్ కూడా నేను ఈ కలెక్షన్స్ ని లెక్కపెట్టుకోలేను మహాప్రభో అనే పరిస్థితి. ప్రీమియర్స్ తో కలుపుకొని కేవలం నాలుగు రోజుల్లోనే ఆరువందల కోట్ల రూపాయలు రాబట్టడమే అందుకు ఉదాహరణ. అంతలా ధురంధర్ 2 సూపర్ డూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ధురంధర్ సిరీస్ నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రణవీర్ సింగ్ పోషించిన హంజా అలీ మజారి అలియాస్ జస్క్ రాత్ సింగ్ క్యారక్టర్ తో అసలైన దురంధర్ మొదటి భాగంలోనే అందరు విన్నారు. కానీ ఇంకో అసలైన ధురంధర్ కూడా ఉన్నాడనే విషయం మీకు తెలుసా! అవును రణవీర్ పోషించిన క్యారక్టర్ ని మించిన అసలైన ధురంధర్ ఉన్నాడు. ఆయనే అజిత్ దోవల్.. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.

ధురంధర్ రెండు భాగాల్లో ఇండియన్ ఇంటిలిజెన్స్ బ్యూరో ‘అజయ్ సన్యాల్'(అజయ్ సన్యాల్)గా మాధవన్ కనిపించిన విషయం తెలిసిందే. ఈ అజయ్ సన్యాల్ క్యారక్టర్ రియల్ ఐబి ఆఫీసర్ గా చేసిన అజిత్ దోవల్ ది. మన దేశం 1974 ,1998 సంవత్సరాల్లో అణుపరీక్షని విజయవంతంగా పూర్తి చేసింది. దీనితో పాకిస్తాన్ కూడా ఎలాగైనా అణ్వస్త్ర సాధనలో దూకుడిగా ఉండాలని చైనా సపోర్ట్ తో తమ క్యాపిటల్ ఇస్లామాబాద్ లో అణు పరీక్షలని చెప్పింది. దీనితో ఆ రహస్యాన్ని కనుక్నే బాధ్యతని అజిత్ దోవల్(అజిత్ దోవల్)కి మన భారత ప్రభుత్వం అప్పచెప్పింది. ఆ వెంటనే అజిత్ దోవల్ ఇస్లామాబాద్ కి తన మకం మార్చాడు. సుమారు ఏడు సంవత్సరాల పాటు పాకిస్తాన్ వీధుల్లో బిచ్చగాడిగా చినిగిన బట్టలు, మాసిన గెడ్డంతో అక్కడి వీధుల్లోనే పడుకోవడం, తినడం చేసాడు. ఆ జర్నీలో అజిత్ దోవల్ హిందువునే డౌట్స్ కొంత మందికి వచ్చాయి.

కానీ చాకచక్యంగా తప్పించుకున్నాడు. అలా ప్రతి నిమిషం ఒక ప్రాణ గండంగా బతుకు పాకిస్తాన్ అణు రహస్యాలని కోసం ప్రయత్నాలు చేసాడు. ఆ ప్రయాణంలో అణు పరీక్షలు చేస్తున్న శాస్తవేత్తలు ఒక బార్బర్ షాపుకి వెళ్లడం గమనించాడు. ఆ తర్వాత వాళ్ళుగానే ఆ అందరి జుట్టు నమూనాలను సేకరించి, వాటిని మన దేశానికి పంపించాడు. ఆ నమూనాలని ల్యాబ్ లో పరీక్షిస్తే యురేనియం,రేడియేషన్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో పాకిస్థాన్ అణ్వస్త్ర తయారీ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు స్పష్టమైంది. ఈ సీక్రెట్ మిషన్ కారణంగానే పాకిస్థాన్ అణు సామర్ధ్య పరీక్షలు దాదాపుగా 15 ఏళ్లు ఆలస్యమయ్యాయి.

కూడా చదవండి:UStaad Bhagat singh: ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కి కొత్త లుక్

1980వ దశకంలో జరిగిన ఈ సంఘటన మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో భారతీయులంతా ‘రోజు తాగే కాఫీనే ఐదు నిముషాలు లేటుగా వస్తేనే తట్టుకోలేం. అలాంటిది దేశం కోసం కుటుంబాన్ని వదిలి ప్రాణాలకి సైతం తెగించి ఉన్నారంటే ఎంత పొగిడినా తక్కువే అని అజిత్ దోవల్ కి సెల్యూట్ చెప్తున్నారు. అజిత్ దోవల్ స్వస్థలం ఉత్తరాఖండ్.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird