
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని కొండాపూర్ “క్వాక్ ఏరినా” పబ్‌లో నిర్వహించిన నైట్ పార్టీ డ్రగ్స్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన డీజే బ్లాక్ కాఫీలో ఈ ఈవెంట్‌కు 1500 మందికి పైగా హాజరైనట్లు సమాచారం. పార్టీలో పాల్గొన్న వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయం బయటపడటంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. డ్రగ్స్ పరీక్షల్లో మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఆరుగురికి గాంజా, ఒకరికి, మరొకరికి మెథాంఫెటమైన్ పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. అంటే ఈ పార్టీలో మొత్తం మూడు రకాల మత్తు పదార్థాల వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయింది.
ఈ నైట్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేసినట్లు. టేబుల్ బుకింగ్ ధరలు రూ.10,000 నుంచి రూ.2 లక్షల వరకు ఉన్నాయి. సౌత్ ఆఫ్రికాకు చెందిన డీజే బ్లాక్ కాఫీ ఈవెంట్‌కు సుమారు రూ.2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముంబైలో ఈ ఈవెంట్ పూర్తి కాగా, హైదరాబాద్ తర్వాత గోవాలో మరో ఈవెంట్ నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్న రితేష్, జ్యోతి రాదిత్య, రిత్విక్ వాసల, అభిషేక్ వర్మ, ఆకెళ్ల హరిత్ సరంగ, రిషబ్ శ్రీవాస్తవ, పిట్ల పృథ్వీరాజ్, మోనిష్ సత్వాని లకు డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

C.E.O
Cell – 9866017966

