Home Latest News వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఈ వస్తువులను వెంట తీసుకెళ్లడం మరవకండి..! | వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు | వేడి వాతావరణంలో తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన విషయాలు | వేసవి ఆరోగ్య చిట్కాలు | సమ్మర్ హీట్ సర్వైవల్ – Jananethram News

వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు ఈ వస్తువులను వెంట తీసుకెళ్లడం మరవకండి..! | వేసవిలో ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు | వేడి వాతావరణంలో తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన విషయాలు | వేసవి ఆరోగ్య చిట్కాలు | సమ్మర్ హీట్ సర్వైవల్ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం. మధ్యాహ్నం పూట ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడమే ఒక పెద్ద పనిగా మారుతుంది. మండే ఎండల్లో బయటకు వెళ్లిరావడం అంటే పెద్ద యుద్ధం చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. ఇంత వేసవి ఎండలో బయటకు వస్తే ప్రతి ఒక్కరు తమకు తాము రక్షణ కల్పించుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వేసవి ఎండలో ఇంటి నుండి బయటకు వెళ్లే అవసరం వస్తే.. మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా కొన్ని వస్తువులు తీసుకెళ్లాలని, అది వారికి ఎంతో ఉపయోగపడుతుందని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకూ వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసిరిగా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటో.. వారి ఉపయోగం ఏంటో తెలుసుకుంటే..

వాటర్ బాటిల్..

మండుటెండలో ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే అనేక అనారోగ్యాలకు అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిల్ ఉంచుకోవాలి. నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, డీహైడ్రేషన్ తీవ్రమై అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ.

సన్ గ్లాసెస్..

వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు బ్యాగ్‌లో సన్ గ్లాసెస్ తప్పకుండా ఉంచుకోవాలి. ఎండ కళ్ళను కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఇవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి.


సన్‌స్క్రీన్ క్రీమ్..

వేసవి ఎండలకు సన్‌స్క్రీన్ క్రీమ్ చాలా ముఖ్యం. సూర్యుని హానికరమైన కిరణాల చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ చర్మం పొడిబారడం లేదా గరుకుగా మారడం మొదలైతే వెంటనే సన్ స్క్రీన్ రాసుకోవచ్చు.

గొడుగు..

వానలో తప్ప ఎండలో గొడుగు వాడటం తెలియని వారు ఉన్నారు. ఈ మండుటెండలో బ్యాగ్‌లో తప్పకుండా ఒక గొడుగు ఉంచుకోవాలి. ఇది ఎండ కాపాడటానికి.

స్కార్ఫ్ లు..

అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు తమ బ్యాగ్‌లో తప్పకుండా స్కార్ఫ్ ఉంచుకోవాలి. ఇది తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది, అలాగే ఎండదెబ్బ, చర్మం నల్లబడటాన్ని కూడా నివారిస్తుంది.

*రూపశ్రీ.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird