Home Latest News ఉస్మానియా బిస్కెట్ ఫ్యాక్టరీపై… వెలుగులోకి షాకింగ్ విషయాలు | ఉస్మానియా బిస్కెట్లు | ఆహార భద్రత అధికారులు | కల్తీ ఆహార రాకెట్ | అంబర్‌పేట్ | ఐస్ క్రీం పార్లర్లు | సీఎం రేవంత్ రెడ్డి | GHMC | తెలంగాణ ప్రభుత్వం | మంత్రి జూపల్లి కృష్ణారావు | హైదరాబాద్ పోలీసులు | సీపీ సజ్జనార్ – Jananethram News

ఉస్మానియా బిస్కెట్ ఫ్యాక్టరీపై… వెలుగులోకి షాకింగ్ విషయాలు | ఉస్మానియా బిస్కెట్లు | ఆహార భద్రత అధికారులు | కల్తీ ఆహార రాకెట్ | అంబర్‌పేట్ | ఐస్ క్రీం పార్లర్లు | సీఎం రేవంత్ రెడ్డి | GHMC | తెలంగాణ ప్రభుత్వం | మంత్రి జూపల్లి కృష్ణారావు | హైదరాబాద్ పోలీసులు | సీపీ సజ్జనార్ – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేస్తున్న దాడుల్లో వరుసగా కల్తీ ఆహార దందాలు బయటపడుతున్నాయి. నగరాన్ని కేంద్రంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వంటింటి నుంచి చిన్నపిల్లలు తినే ఆహార పదార్థాల వరకు కల్తీ వ్యాపారం బయటపడినట్లు ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. ఇటీవల పిల్లలు ఎంత ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై జరిగిన దాడుల్లో కుళ్లిన పదార్థాలు, ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టు గుర్తించిన అధికారులు, తాజాగా పలు ప్రాంతాల్లో బేకరీ యూనిట్లపై దాడులు జరిగాయి. ఈరోజు నిర్వహించిన తనిఖీల్లో… ఎక్కువ మంది చాయ్‌తో పాటు ఇష్టంగా తినే ఉస్మానియా బిస్కెట్ల తయారీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ ఉస్మానియా బిస్కెట్ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం రండి…

హైదరాబాద్‌లోని అంబర్‌పేట ప్రాంతంలో పోలీసులు ఉస్మానియా బిస్కెట్లు తయారు చేసిన ఓ ఫ్యాక్టారు పై, ఫుడ్‌సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు సూచించబడ్డాయి. బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు రావడానికి ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగులు తయారు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తనిఖీల సమ యయంలో ఉన్న ఆ శుభ్రత వాతావరణం చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు.

పరిశుభ్రత ప్రమాణాలు పూర్తిగా లెక్కించకుండా బిస్కెట్లు తయారీ జరుగుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. అంతేకాదండోయ్ మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. బిస్కెట్ల తయారీలో నాసిరకం పాడైన గుడ్లు వస్తువులను పోలీసులు గమనించారు. అయితే ఈ విధంగా కుళ్ళిన గుడ్లతో ఉస్మానియా బిస్కెట్లను తయారుచేసి వాటిని పలు షాపులకు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిర్మాతలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. నగరంలో ఆహార భద్రతా ప్రమాణాలపై మరింత కఠినంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు జరుగుతాయని…. ఈ ఘటనతో నగరంలో ఫుడ్ సేఫ్టీ చర్చనీయాంశంగా మారింది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird