Home సినిమా మెగా వారసుడు టు గ్లోబల్ స్టార్.. పడి లేచిన కెరటం రామ్ చరణ్! – Jananethram News

మెగా వారసుడు టు గ్లోబల్ స్టార్.. పడి లేచిన కెరటం రామ్ చరణ్! – Jananethram News

by Jananethram News
0 comments
tmdb-header-middle-logo


సినీలో బ్యాక్ గ్రౌండ్ అనేది ఎంట్రీకి పనికొస్తుంది కానీ, ఇక్కడ నిలబడాలంటే టాలెంట్ తో పాటు ఇండస్ట్రీ హార్డ్ వర్క్ ఉండాలి. ఆ రెండు పుష్కలంగా ఉన్న హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. (రామ్ చరణ్)

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా బోలెడంత బరువు బాధ్యలతో వెండితెరకు పరిచయమయ్యాడు. అనతికాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

రామ్ చరణ్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ట్రోల్స్ ఉన్నాయి. వాట నిలబడి తట్టుకొని గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు.

2007లో విడుదలైన చిరుత సినిమాతో రామ్ సినీ చరణ్ ప్రయాణం. ఆ సినిమా విడుదలకు ముందు చరణ్ లుక్, టాలెంట్ గురించి రకరకాల కామెంట్స్ వినిపించాయి. కానీ, తనదైన స్క్రీన్ ప్రెజెన్స్, డ్యాన్స్, ఫైట్స్‌తో మొదటి సినిమాతోనే తన టాలెంట్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేవాళ్ళు అత్యంత అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన హీరోనే రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీరతో సినీ తెలుగు రికార్డులను తిరగరాశాడు. దీంతో కేవలం రెండో సినిమాకే బిగ్ స్టార్ గా ఎదిగాడు.

అయితే ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో మూన్నాళ్ళ ముచ్చట అంటూ చరణ్ స్టార్ డమ్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. వాటికి వెంటనే సమాధానమిచ్చాడు చరణ్. రచ్చ, నాయక్ వంటి సాధారణ కమర్షియల్ సినిమాలతో కూడా వసూళ్ళ వర్షం కురిపించినట్లు నిరూపించి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. అందరి చేత మిస్టర్ బాక్సాఫీస్ అనిపించుకున్నాడు.

అదే సమయంలో చేసిన బాలీవుడ్ ప్రయత్నం మాత్రం రామ్ చరణ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. జంజీర్ తో హిందీ గడ్డపై అడుగుపెట్టిన ఆయనకి ఘోర పరాజయం ఎదురైంది. ముఖ్యంగా చరణ్ యాక్టింగ్ పై దారుణమైన ట్రోల్స్ వచ్చాయి.

ఆ ట్రోల్స్ కి చరణ వెనక్కి తగ్గకపోగా.. తనని తాను మరింత గొప్పగా మలుచుకున్నాడు. తనలో ఎంత గొప్ప నటుడు దాగి ఉన్నాడో చాటి చెప్పాడు. ధృవ, రంగస్థలం సినిమాలతో నటుడిగా తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. ముఖ్యంగా రంగస్థలంలో చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. జాతీయ అవార్డు అందుకునే అర్హత గల నటన అంటూ ప్రతి ఒక్కరూ కొనియాడారు.

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ రామ్ చరణ్ కెరీర్‌లో మైలురాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో చరణ్ నటించిన అల్లూరి సీతారామరాజు పాత్ర ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. గ్లోబల్ స్టార్‌గా ఆయనను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. అంతేకాదు, జంజీర్ సమయంలో ఏ బాలీవుడ్ మీడియా అయితే చరణ్ ని ట్రోల్ చేసిందో.. అదే బాలీవుడ్ మీడియా ఆర్ఆర్ఆర్ లో ఆయన నటనకు సలామ్ కొట్టింది.

ప్రస్తుతం చరణ్ పెద్ది(Peddi) అనే మూవీ చేస్తున్నాడు. చిట్టిబాబు, అల్లూరి సీతారామరాజు తరహాలో ఇది కూడా ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర అని ప్రమోషనల్ కంటెంట్ తోనే అర్థమవుతోంది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం రామ్ చరణ్ సొంతం. తన సింప్లిసిటీ, వినయం, అలాగే ఫ్యాన్స్‌తో ప్రేమగా ఉండే తీరుతో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి ఎంత పెద్ద స్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వారసుడిగా ఎంట్రీ అంటే.. ఎన్నో అంచనాలు ఉంటాయి, ఎంతో ఒత్తిడి ఉంటుంది. పైగా మొదట్లో చరణ్ ని చూసినవారు ఎప్పటికీ మరో చిరంజీవి కాలేడు అంటూ చాలా తక్కువ అంచనా వేశారు. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ.. చిరుకి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు ఈ చిరుత.

మెగా వారసుడిగా మొదలైన రామ్ చరణ్ ప్రయాణం, తన కష్టంతో గ్లోబల్ స్టార్ స్థాయికి చేరింది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎదుర్కొని నిలబడి, తన టాలెంట్‌తో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఆయన అప్ కమింగ్ యాక్టర్స్ కి ఇన్‌స్పిరేషన్ అనడంలో సందేహం లేదు.

రామ్ మరిన్ని ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటూ.. తెలుగువారి తరపున చరణ్ జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird