Home Latest News ఐపీఎల్ 2026 రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది…ఇక సమరం షురూ! | IPL 2026 | రెండో దశ షెడ్యూల్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | ఢిల్లీ రాజధానులు | SRH | RCB | KKR | CSK | RR | ట్రావిస్ హెడ్ | అభిషేక్ శర్మ | విరాట్ కోహ్లీ | మహేంద్ర సింగ్ ధోని – Jananethram News

ఐపీఎల్ 2026 రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది…ఇక సమరం షురూ! | IPL 2026 | రెండో దశ షెడ్యూల్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | ఢిల్లీ రాజధానులు | SRH | RCB | KKR | CSK | RR | ట్రావిస్ హెడ్ | అభిషేక్ శర్మ | విరాట్ కోహ్లీ | మహేంద్ర సింగ్ ధోని – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


ఐపీఎల్ 2026 రెండో విడత షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు మొత్తం 12 వేదికల్లో నిర్వహించనున్నారు. రెండో దశ తొలి మ్యాచ్ ఏప్రిల్ 13న హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ మధ్య జరగనుంది. మే 24న కోల్‌కతాలో కోల్‌కతా నైట్ రైడర్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ దశ ముగియనుంది. ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల తేదీలు, వేదికలను తర్వాత నిర్ణయించామని బీసీసీఐ.

ఇదివరకు విడుదలైన తొలి దశ షెడ్యూల్ ప్రకారం మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 నుండి 20 వరకు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. రెండో దశలో 50 మ్యాచ్‌లు కలిపి, మొత్తం లీగ్‌లో 70 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.రెండో దశలో 8 డబుల్ హెడ్‌డర్ మ్యాచ్‌లు. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.ఈ మ్యాచ్‌లకు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లఖ్‌నవూ, జైపూర్, ధర్మశాల, రాయపూర్, చండీగఢ్ వేదికలుగా ఉన్నాయి.

ఐపీఎల్ అంటేనే.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ కనిపిస్తుంది. క్రికెట్‌ ఆస్వాదించే వాళ్లకు.. మ్యాగ్జిమమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. అందుకే.. సీజన్ మొదలవడానికి ముందే హీట్ పీక్స్‌కి చేరింది. యావత్ క్రికెట్ ప్రపంచం మొత్తం.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ కోసం కళ్లు పెద్దవి చేసుకొని ఎదురుచూస్తోంది. మార్చి 28న డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే సూపర్ ఫైట్‌తో.. మెగా టోర్నీ గ్రాండ్‌గా మొదలుకానుంది.

గత సీజన్‌లో.. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి కప్పు కొట్టి చరిత్ర సృష్టించింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతున్న బెంగళూరుపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ఐదుసార్లు ఛాంపియన్లు అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి కప్పును ముద్దాడాలనే కసితో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా 2016 సీన్ రిపీట్ చేయాలని చూస్తోంది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా టైటిల్ రేసులో పోటీ పడుతున్నాయి.

ఈ సీజన్‌లోనూ సిక్సర్ల సునామీతో.. బౌండరీల బాదుడుతో.. పరుగుల వరద పారించేందుకు అన్ని టీమ్స్‌లోనూ హిట్టర్లు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ మరోసారి పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. గత సీజన్ విజేతగా నిలిచిన జోష్‌తో.. విరాట్ కోహ్లీ మరోసారి ఆరెంజ్ క్యాప్ రేసులో నిలవనున్నాడు. టీ20 నెంబర్ వన్ బ్యాటర్, వినూత్న షాట్లతో మైదానం కవర్ చేసే ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ కూడా మరోసారి మెరిసే అవకాశం ఏర్పడింది.

ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో దుమ్మురేపిన సంజూ శాంసన్‌పైనే ఇప్పుడు అందరి అటెన్షన్ ఉంది. ఈ లీగ్‌లోనూ.. అతను స్టేడియం దద్దరిల్లేలా ఆడతాడా? లేదా? అని అంతా వెయిట్ చేస్తున్నారు. స్పిన్, పేస్ అనే తేడా లేకుండా, బాదడం తప్ప మరొకటి తెలయదన్నట్లు ఆడే హెన్రిచ్ క్లాసెన్.. సేమ్ ఫామ్ కంటిన్యూ చేస్తాడని ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇక.. రింకూ సింగ్ ఫినిషర్ రోల్‌లో తన పవర్ మరోసారి చూపించే ఛాన్స్ ఉంది. రిషబ్ పంత్.. ఈసారి లక్నో టీమ్ కెప్టెన్ బాధ్యతలతో పాటు బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ఐపీఎల్ సీజన్‌లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని టీమ్స్‌లో కెప్టెన్లు, ప్లేయర్లు మారిపోయారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్.. రియాన్ పరాగ్ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్.. ఈసారి మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ మెరుపులు చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా సారథ్యంలో.. రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్లతో.. ముంబై ఫుల్ స్ట్రాంగ్‌గా ప్రారంభించారు. ఈ సీజన్.. బ్యాటర్లదే అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఈసారి బౌలర్లు కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. గ్రౌండ్‌లోకి దిగితేగా కాకుండా వికెట్ల వేటగాళ్లుగా మారిపోనున్నారు. డెత్ ఓవర్ల కింగ్ బుమ్రా ముంబైకి వెన్నెముకలా నిలవనున్నాడు. గుజరాత్ టైటాన్స్ కంపెనీ రషీద్ ఖాన్ మ్యాజిక్ కోసం సిద్ధమయ్యాడు. గత సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్.. ప్రసిద్ధ కృష్ణ.. ఈసారి కూడా ఫేవరెట్‌గా ఉన్నాడు.

టీమ్‌లవారిగా చూస్తే.. ముంబై ఇండియన్స్.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మతో.. బలమైన బ్యాటింగ్ కోర్ ఉంది. బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా రూపంలో బెస్ట్ పేస్ ఉంది. అయితే.. మెరుగైన స్పిన్నర్ల కొరత స్పష్టంగా ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టులో.. ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రింకూ సింగ్, కామెరాన్ గ్రీన్ లాంటి పవర్ హిట్టర్లు ఉన్నాయి. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి స్పిన్ జోడీ కీలకంగా మారనుంది. అయితే, కేకేఆర్‌లో.. పేస్ బౌలింగ్ బలహీనంగా మారింది. ఇక.. చెన్నై సూపర్ కింగ్స్.. ఎంఎస్ ధోనీ మార్గదర్శకత్వంలో బలంగానే మార్చబడింది.

సంజూ శాంసన్ టీమ్‌లోకి రావడం మరో ప్లస్ పాయింట్. స్పిన్‌లో నూర్ అహ్మద్, రాహుల్ చాహర్ బలంగా ఉన్నారు. అయితే, డెత్ ఓవర్లలో వికెట్లు తీసే పేసర్ల కొరత ఉంది. విధ్వంసకర బ్యాటర్లతో సన్‌రైజర్స్ ఉండాల్సినంత స్ట్రాంగ్‌గా ఉంది. అయితే, కెప్టెన్ పాట్ కమిన్స్ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడం మైనస్‌గా మారే ఛాన్స్ ఉంది. ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పేస్ బౌలింగ్‌లో నిలకడ లేకపోవడం టీమ్‌లో సమస్యగా మారింది.

ఇక.. కోహ్లీ, రజత్ పాటిదార్, ఫిలిప్ సాల్ట్‌తో.. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. అయితే, బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది. గుజరాత్ టైటాన్స్ విషయానికొస్తే.. గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్‌తో కూడిన టాప్ ఆర్డర్ బలంగా ఉంది. రషీద్ ఖాన్ స్పిన్, సిరాజ్ పేస్ అదనపు బలంగా మారనుంది. ఫినిషర్ పాత్రలో రాహుల్ తెవాటియాపై అతిగా ఆధారపడుతోంది. మరి.. వీళ్లంతా ఈసారి ఎలాంటి ఫామ్ కనబరుస్తారనే దానిపైనే.. ఐపీఎల్ సీజన్ ధమాకా ఎలా ఉండబోతుందన్నది.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird