
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిని భయపెడుతోందంట. తాజాగా ఆ సినిమా గురించి ఆఫ్రిది స్పందించినట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ధురంధర్ 2 చిత్రం చూసిన తర్వాత పాకిస్థాన్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి ఉందని అఫ్రిది కామెంట్ ఓ పోస్ట్ చేసినట్లు.
ధురంధర్ 2 సినిమా చూసిన తర్వాత పాకిస్థాన్‌లో ఎవరిని నమ్మాలన్న భయం వేస్తోందని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఒకప్పుడు తాను ఎవరితోనైనా త్వరగా మాట్లాడేవాడినని, కానీ ధురంధర్ 2 చూసిన తర్వాత ఎవరితో మాట్లాడాలన్నా ఇప్పుడు వందసార్లు ఆలోచిస్తున్నానని చెప్పాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి భారత గూఢచారా అన్న అనుమానం తనను వెంటాడుతోందన్నాడు.
కేవలం ప్రముఖులే కాకుండా రోడ్డు పక్కన భిక్షగాళ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరినీ పాకిస్థాన్ ప్రభుత్వం క్షుణ్ణంగా విచారించాలని, వారిలో భారత ఏజెంట్లు ఉన్నారేమో తేల్చాలని అఫ్రిది వింత ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని సమాచారం.

C.E.O
Cell – 9866017966

