
కాంగ్రెస్ పార్టీకి కేంద్రం షాక్ ఇచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే 48 ఏళ్లుగా ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1978 నుంచీ ఈ నెల 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయించారు.
1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్న నంబర్ 24, అక్బర్ రోడ్ భవనాన్ని ఈ నెల 28 లోగా అంటే శనివారం లోగా ఖాళీ చేయాలంటూ కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ భవనంతో పాటు.. రైసినా రోడ్లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయడానికి తాఖీదులు పంపింది.
నిజానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఢిల్లీలోని కోట్ల మార్గ్‌లో ఇందిరా భవన్ పేరుతో కొత్త జాతీయ కార్యాలయాన్ని నిర్మించుకుంది. నిబంధనల ప్రకారం పార్టీ సొంత భవనం నిర్మాణం పూర్తయితే..పాత భవనాన్ని ఖాళీ చేయవలసి ఉంటుంది. ఇందిరా భవన్ కు ఏడాది కిందటే సోనియాగాంధీ గత ఏడాదే సోనియా గాంధీ ప్రారంభోత్సవం కూడా చేశారు.
ఈ నేపథ్యంలోనే కేంద్రం అక్బర్ రోడ్డు భవనాన్ని ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసులపై కాంగ్రెస్ మండి పడింది. రాజకీయ కక్ష సాధింపు చర్యేనంటూ విమర్శిస్తోంది. ఈ నోటీసులను కోర్టులో సవాల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

C.E.O
Cell – 9866017966

