Home సినిమా బాలీవుడ్ దండయాత్ర.. టాలీవుడ్ కి ముప్పు – Jananethram News

బాలీవుడ్ దండయాత్ర.. టాలీవుడ్ కి ముప్పు – Jananethram News

by Jananethram News
0 comments
బాలీవుడ్ దండయాత్ర.. టాలీవుడ్ కి ముప్పు


-ధురంధర్ 2 కి తెలుగు సినిమాకి సంబంధం ఏంటి!
-తెలుగు సినిమాకి గట్టి పోటీ ఏర్పడనుందా
-ధురంధర్ 2 తో తెలుగు సినిమా తెసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి!

నిజానికి, సినిమా పప్రంచం ఎప్పు డు ఊహించని మలుపులతో, రికార్డులతో నిండి ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ నుండి వచ్చిన ధురంధర్ 2(ధురంధర్ 2)తో అదే జరుగుతోంది. ధురంధర్ 2 ది రివెంజ్” విడుదలైన మొదటివారాంతంలోనే బాక్సా ఫీస్ వద్దపెను సంచలనం సృష్టిస్తుంది.రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ నుంచి వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వరుసగా రెండు రోజులు 100 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా రికార్డు సృష్టించింది.

దీంతో ఇప్పుడు ఈ చిత్రం మన టాలీవుడ్ కి ఒక హెచ్చరికగా కూడా పరిగణించవచ్చు . గత కొన్ని సంవత్సరాలుగా మనం బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నట్టుగా బాలీవుడ్ చిత్రాలు కూడా దక్షిణాది మార్కెట్ పై దృష్టి సారిస్తున్నా యి.ఈ కోవలోనే ధురంధర్ 2 ఇప్పుడు తెలుగునాట రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ధురంధర్ 2 విజయం దక్షిణాదిసినీ ప్రియులు ఉత్తర భారతీయ సినిమాలని ఎంతగానో ఆదరిస్తున్నా రనడానికి ఒక నిదర్శనం. ఇదిమన తెలుగు చిత్రపరిశమ్రకి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. కథాంశాల విషయంలో, నిర్మ ణ విలువల్లో, మరియు మార్కెటింగ్ వ్యూ హాలలో కొత్తదనంతో
ముందుకు సాగాలి. అగ్రనటులని, సాంకేతిక నిపుణులను సంపద్రించి, భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మించాలి.

ఇక ధురంధర్ 2 విజయం రణవీర్ సింగ్(Ranveer Singh)కెరీర్ కి ఎంతో కొంత మారింది. గతంలో ఆయన కొన్ని విజయాలు సాధించా, అవన్నీ ఒక ఎత్తు. ధురంధర్ 2 నే ఒక ఎత్తు. రణవీర్ నటన, యాక్షన్ సన్ని వేశాలు, సాంకేతిక విలువలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ విజయం ఆయన మార్కెట్ విలువని మరింత పెంచే అవకాశం ఉంది. రాబోయేరోజుల్లో రణవీర్ మరిన్ని భారీప్రాజెక్ట్‌లలో నటించేఅవకాశం ఉంది.

కూడా చదవండి: ప్రియాంక మోహన్: హీరో లేడు కానీ హిట్ కొట్టింది బాసు.. మరి ఓజి ఇచ్చిన ఎనర్జీ అలాంటిది

మన సినిమా విషయానికివస్తే దర్శక, నిర్మ తలు కొత్తకథలని ఎందుకు కోవాలి. ప్రాంతీయ చిత్రాలని చెరిపేస్తూ , పప్రంచవ్యా ప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేసినిమాలను తీయాలి. నటీనటులు కూడా నటనలో కొత్త మెళుకువలు నేర్పు కుంటూ, వైవిధ్యమైన క్యారెక్టర్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి సినిమాని ఒక్కసారిగా స్వీకరించి ప్రేక్షకులకు సరికొత్తఅనుభూతిని కలిగించేలా కృషిచేయాలి. ముందు ముందు ధురంధర్ 2 మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. ఈ సినిమా బాలీవుడ్ చిత్రపరిశమ్రకు ఒక కొత్తదిశానిర్దేశం చేసిందని చెప్పవచ్చు . అయితే, ఈ విజయం కేవలం ఒక సినిమాకే పరిమితం కాకుండా, బాలీవుడ్ చిత్రాల పరంపరను పెంచేఅవకాశం ఉంది.మరి ఈ విజయం టాలీవుడ్ పరిశ్రమలో ఎలాంటిమార్పులకి నాందిపలుకుతుందో వేచి చూడాలి.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird