
అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా భారతీయులు కనిపిస్తారని ఆయన స్పష్టం చేశారు. టెక్నాలజీ, టెలి కమ్యూనికేషన్స్ లాంటి సంస్కరణల్ని మొదటగా అందిపుచ్చుకోవటం వల్లే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి వివరించారు. ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ- అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైసినా డైలాగ్ సదస్సులో సాంకేతికత – సుపరిపాలన – భవిష్యత్తు అనే అంశంపై చంద్రబాబు మాట్లాడారు. సహకార సమాఖ్య దేశంగా కేంద్రంతో, పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని సీఎం వివరించారు.
ఐటీలో భారతీయుల గురించి అందరికీ తెలుసునని .. డిప్లొమసి, ఫ్లెక్సిబిలిటీలో వారికి మంచి పేరు ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో సిలికాన్ వ్యాలీ లాంటి చోటుకు భారత్ నుంచి మేధో వలస ప్రారంభమైంది, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. నైపుణ్యం, వనరులు ఉన్న అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మేర జీసీలు భారత్ కు వచ్చాయి. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా భారత్ దూసుకెళ్తోందని తెలిపింది. భవిష్యత్తులో అనేక దేశాలకు విద్యుత్ ను భారత్ ఎగుమతి చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అప్పుడు కుటుంబ నిర్వహణ-ఇప్పుడు జనాభా నిర్వహణ
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోందని.. ఆ ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే జాగ్రత్త పడుతున్నామని సీఎం వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 1.5 ఫెర్టిలిటీ రేటును 2.1గా తీసుకెళ్లేందుకు పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీని భారత్ తీసుకొచ్చామని సీఎం తెలియజేశారు. ప్రజాప్రతినిధిగా 30 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణ గురించి చేసి ఇప్పుడు పాపులేషన్ మేనేజ్‌మెంట్ గురించి చర్చిస్తున్నామని ప్రచారం చేశారు. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు. ఏజింగ్ సమస్యను ఎదుర్కొంటున్న దేశాలు జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మూడో బిడ్డ పుడితే రూ.25 వేల ఆర్థిక సాయం, నెల వారీగా రూ. వెయ్యి అందించాలని నిర్ణయించామని చెప్పారు. చైల్డ్ కేర్ లీవ్‌లాంటి ప్రోత్సాహకాలు ఆలోచిస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవలు అందించే సామర్ధ్యం భారత్ కు మాత్రమే ఉంది.
వృద్ధుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ అత్యంత కీలకమని సీఎం స్పష్టం చేశారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఇప్పుడు జనాభా వృద్ధిపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమై ఉంది. గతంలో ఉన్న పెద్ద కుటుంబాలు దేశానికి పెద్ద ఆస్తి అని.. ప్రస్తుతం అవి మైక్రో ఫ్యామిలీలు గా మారుతున్నాయి. ఈ విషయంలో ప్రజల దృష్టి కోణం మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.
అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్
విభిన్నంగా ఆలోచన చేసే వారి కోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మించామని.. డ్రోన్ సిటీ, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కూడా నిర్మించామని అన్నారు. గతంలో ఊహగానే ఉన్న డ్రోన్ అంబులెన్సులు కూడా రియాలిటీలోకి వచ్చేశాయి. ఏఐ డేటా సెంటర్లతో ఏపీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ డెస్టినేషన్ గా ఏపీ తయారవుతుందని అన్నారు. పెట్టుబడులతో జాప్యం లేకుండా అనుమతులు ఇస్తున్నట్లు పేర్కోన్నారు.
అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఈ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ సహా 110 దేశాల నుంచి 2700 మందికి పైగా ప్రతినిధులు, మేధావులు, నిఫుణులు, వ్యూహకర్తలు. 2016 నుంచి జరుగుతున్న ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ సదస్సుకు తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి నిర్వాహకులు ఆహ్వానం పలికారు. వారి ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఈ రైసినా డైలాగ్‌కు హాజరైన తన అభిప్రాయాలను వివరించారు.

C.E.O
Cell – 9866017966


.webp)

