Home Latest News భద్రాచలంమారుమూల గిరిజన ప్రాంతమైన దుమ్ముగూడెం మండలంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ మరియు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సా శిబిరములు విజయవంతంప్రారంభించిన

భద్రాచలంమారుమూల గిరిజన ప్రాంతమైన దుమ్ముగూడెం మండలంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ మరియు ఉచిత నేత్ర శస్త్ర చికిత్సా శిబిరములు విజయవంతంప్రారంభించిన

by Jananethram News
0 comments

జననేత్రం న్యూస్రో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్30*//:భద్రాచలం ప్రాజెక్టు ఆఫీసర్ ఐటిడిఎ బి.రాహుల్ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్, లయన్స్ క్లబ్ భద్రాచలం, లయన్స్ క్లబ్ జటావు, వికాస తరంగిణి వార్ల అధ్వర్యంలో యంఎన్ కేన్సర్ ఆసుపత్రి హైదరాబాద్ వారి బృందము ‘పుష్పగిరి కంటి ఆసుపత్రి’ సికింద్రాబాద్ బృందం వార్ల సహకారంతో నేడు దుమ్ముగూడెం మండలంలోని ములకపాడు’ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్స మరియు నేత్ర శస్త్ర చికిత్స శిబిరములు విజయవంతమైనది. ఈ శిబిరములను ప్రాజెక్టు ఆఫీసర్ ఐటిడిఎ బి.రాహుల్ ప్రారంభించినారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆఫీసర్ ఐటిడిఎ బి. రాహుల్ మాట్లాడుతూ భద్రాచలం గిరిజన ప్రాంతంలో కంటి చూపు తక్కువతో చాలా మంది బాధపడుతున్నారని, అదే విధంగా గర్భకోశ వ్యాధులు, రొమ్ముల్లో గడ్డలతో మహిళలు బాధపడుతున్నారని ఇటువంటి పేద ప్రజల, ఆదివాసీ గిరిజనుల ఆరోగ్యం సంరక్షించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, లయన క్షబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ శిబిరములు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని, స్వచ్ఛంద సంస్థల సేవలను అభినందించినారు. అలాగే క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ శిబిరము నిర్వహించుటకు యంయన్ క్యాన్సర్ ఆసుపత్రి వారు, పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ వారు ఏజన్సీ ప్రాంతమైన భద్రాచలం మారుమూల ప్రాంతాలకు వారి బృందాలను పంపించడం అభినందనీయమని కొనియాడారు.
శ్రీ పొదెం వీరయ్య తెలంగాణ ఫారెస్టు డెవెలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ ఈ శిబిరం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మండల కాంగ్రెస్ ప్రతినిధులు వినీల్, స్వామిల ద్వారా సందేశాన్ని పంపించినారు. పేద ప్రజలు, ఆదివాసీ గిరిజనులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపినారు. అనివార్య కారణాల వలన తాను శిబిరమునకు హాజరు కాలేక పోయానని తెలిపినారు.
ఈ శిబిరంలో డా.ఎస్.ఎల్.కాంతారావు డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్ మాట్లాడుతూ ప్రాజెక్టు ఆఫీసర్ ఐటిడిఎ భద్రాచలం బి. రాహుల్ సహాయ సహకారాలతో సహకారంతో ఈ శిబిరం నిర్వహించగలిగామని, వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మారుతి నర్సింగ్ కాలేజి విద్యార్థినులు, సిబ్బంది దుమ్ముగూడెం మండలంలోని 190 మారుమూల గ్రామాలలో సైతం ఇంటింటికి ప్రచారం నిర్వహించి సర్వే జరిపినారని తెలిపినారు. ఈ శిబిరములో నేడు 219 మందిని కంటి చూపు తక్కువగా ఉన్న వారిని పరీక్షించి, 142 మందిని కేటరాక్ట్ కంటి ఆపరేషన్ల కొరకు ఎంపిక చేసినట్లు తెలిపినారు. అలాగే మొత్తం 40 మందికి క్యాన్సర్ నిర్ధార పరీక్షలు నిర్వహించగా, 10గురికి క్యాన్సర్ నిర్ధారణకు ప్రాథమికంగా
పరీక్షలు నిర్వహించడం జరిగింది. అలాగే 12 మందికి అల్ట్రాసౌండ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించినట్లు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డా॥ఎస్.ఎల్.కాంతారావు, ఐఆర్సిఎస్ జిల్లా కోఆర్డినేటర్, డా॥ చైతన్య, డిప్యూటి డిఎం & హెచ్్వ, వై. సూర్యనారాయణ, ఎ.జగదీష్, శ్రీమతి కమలా రాజశేఖర్, నక్కా వెంకన్న యాదవ్, వి.కామేశ్వరరావు, యం. సిద్ధారెడ్డి, డా||యుగంధర్, బానోత్ రాము, యంఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధి ప్రసాద్, పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రతినిధి మధు, క్యాన్సర్ నిపుణులు డా.పి.ప్రజ్ఞా, డా|| యం. మధు మోహన్ రెడ్డి, ఆప్తాల్మిక్ వైద్యులు జి.సంజీవరావు. బాలకృష్ణ, ఆర్. కృష్ణవేణి, ఆదినారాయణ, మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

డా.ఎస్.ఎల్.కాంతారావు

డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్, ప్రోగ్రామ్ చైర్మన్

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird