Home Latest News భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారం… అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

by Jananethram News
0 comments

*ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్ష, కార్యదర్శులకు, అధికారులకు  భూ భారతి చట్టంపై అవగాహన కల్పించిన అదనపు కలెక్టర్

 *జననేత్రంన్యూస్.ఉమ్మడిఖమ్మంజిల్లాబ్యూరోజూన్13*//:
ప్రభుత్వం రూపొందించిన నూతన భూ భారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యల పరిష్కారానికి  మార్గం లభిస్తుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు.
శుక్రవారం అదనపు కలెక్టర్, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు తో కలిసి కలెక్టరెట్ లోని సమావేశ మందిరంలో సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్ష, కార్యదర్శులకు, కో ఆపరేటివ్ అధికారులకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ* ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు భూ భారతి చట్టం తీసుకుని వచ్చారని, దీని ద్వారా భూ సమస్యలు సత్వర పరిష్కార మవుతాయనీ, భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై ప్రజలకు అభ్యంతరం ఉంటే అప్పీల్ చేసుకునే అవకాశం భూ భారతి చట్టం కల్పించిందని, తహసిల్దార్ నుంచి సిసిఎల్ఏ వరకు అప్పీల్ చేసుకోవచ్చని, గతంలో కేవలం సివిల్ కోర్టుల ద్వారా మాత్రమే లభించే పరిష్కారం నేడు రెవెన్యూ వ్యవస్థ దగ్గర అందుబాటులో ఉంటుందని అన్నారు.
వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ జరిపి హక్కుల రికార్డులో మ్యుటేషన్ చేస్తారని, తహసిల్దార్ నిర్ణీత వ్యవధి 30 రోజుల లోగా విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. పెండింగ్ సాదా బైనామా సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ భూభారతి చట్టంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి గంగాధర్, డిసిసిబి సీఈఓ వెంకట ఆదిత్య, వరంగల్ తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ వైస్ ప్రిన్సిపల్ రాజయ్య, కో ఆపరేటివ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird