[ad_1]
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భూమి కంపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం( ఏప్రిల్ 3) భూకంపం సంభవించింది. భూమి కంపించడంతో ఇళ్లు, ఆఫీసుల నుంచి భయంతో పరుగులు తీశారు. ఢిల్లీతో సహా పంజాబ్లోని నోయిడా, ఛండీగఢ్, లూధియానాలో భూమి కంపించింది. అలాగే పూంచ్, శ్రీనగర్, ఉదమ్పూర్, జమ్ము కశ్మీర్లోనూ భూమి కంపించింది.
కాగా ఆప్ఘనిస్థాన్ లోనూ శుక్రవార (ఏప్రిల్3) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఆ భూకంప ప్రభావంతోనే భారత్ లో పలు ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించాయని అధికారులు చెబుతున్నారు.
[ad_2]