[ad_1]
ప్రణవ్ రావ్ రాణి, ప్రజక్త గైక్వాడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "గూగుల్ మై ఫ్రెండ్". ఈ డాలర్స్ మీడియా అండ్ ఎంటర్ టైన్ ట్రీట్ బ్యానర్ పై దివాకర్ రెడ్డి పెట్టారు. బహు భాషల్లో పలు హిట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోవింద్ వరాహ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. "గూగుల్ మై ఫ్రెండ్" సినిమాకు టి. వెంకటేష్ రెడ్డి, బి.ప్రసన్నాంజనేయులు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా త్వరలో తెలుగు, మరాఠీ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, వి సముద్ర, శైలేష్ కొలను, కొండా విజయ్ కుమార్ చేతుల మీదుగా ఈ చిత్ర సాంగ్స్ లాంఛ్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ సాయిరాజేశ్ మాట్లాడుతూ - మా దర్శకుల సంఘం సభ్యులు, మా ఆత్మీయులు గోవింద్ డైరెక్ట్ చేస్తున్న గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్, టీజర్ ఇతర కంటెంట్ చూశాం. ఈ కంటెంట్ అంతా ప్రామిసింగ్ గా ఉంది. ఒకేసారి తెలుగు, మఠీ భాషల్లో ఆయన ఈ విధంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మంచి రిలీజ్ కుదిరి ప్రొడ్యూసర్ కు డబ్బులు, గోవింద్ గారికి పేరు రావాలని కోరుకుంటున్నాను. అన్నారు.
వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ - గూగుల్ మా ఫ్రెండ్ సినిమాను మా ఫ్రెండ్ గోవింద్ వరాహ రూపొందించారు. ఆయన బహు భాషల్లో సినిమాలు రూపొందించిన దర్శకుడు. ఈ తెలుగు, మరాఠీ భాషల్లో త్వరలో మన ముందుకు రానున్నాయి.ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. అలాగే గోవింద్ వరాహ గారు మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
వి సముద్ర మాట్లాడుతూ - మా స్నేహితుడు గోవింద్ గూగుల్ మై ఫ్రెండ్ అనే డైరెక్టర్ పలు భాషల్లో రూపొందించడం సంతోషంగా ఉంది. మా డైరెక్టర్ అసోసియేషన్ మెంబర్స్ సమక్షంలో సాంగ్స్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మంచి సక్సెస్ రావాలని మేమంతా బ్లెస్ చేస్తున్నాను. గోవింద్ గారికి అన్ని భాషల్లో గుర్తింపు, విజయం రావాలి. అన్నారు.
కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ డైరెక్టర్ - రామానాయుడు గారు అన్ని భాషల్లో సినిమాలు నిర్మించాలని ఎలా కంకణం కట్టుకున్నారో, గోవింద్ గారు కూడా బహు భాషల్లో సినిమాలు చేస్తున్నారు. తెలుగు, మలయాళం, ఒరస్సా, మరాఠీ ఇలా వివిధ భాషల్లో సినిమాలు రూపొందిస్తున్నారు. గూగుల్ మై ఫ్రెండ్ సినిమా రిలీజ్ చేసిన ప్రతి భాషలో విజయం సాధించాలి. అన్నారు.
డైరెక్టర్ గోవింద్ వరాహ మాట్లాడుతూ - నేను తెలుగులో బాల, నేను నాన్న అబద్ధం, మనుషులతో జాగ్రత్త వంటి చిత్రాలను రూపొందించాను. మలయాళంలో కొన్ని చిత్రాలను రూపొందించాను. మరాఠీలో ఓ సినిమా తెరకెక్కించాను. తెలుగుతో పాటు ఇతర భాషల్లో గూగుల్ మై ఫ్రెండ్ రూపొందించాను. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు ఎన్నికైన నా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ రోజు మా మూవీ సాంగ్స్ విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నాను. శైలేష్, సముద్ర, విజయ్ కుమార్, సాయిరాజేశ్, వీఎన్ ఆదిత్య గారు..ఇలా నా కుటుంబ సభ్యులైన వీరందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇతర భాషల్లో సినిమాలు చేస్తూ తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నానేమో అనిపించిన టైం లో గూగుల్ మై ఫ్రెండ్ అనే సినిమాను రూపొందించాను. ఇకపైనా తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తాను. మా నిర్మాతలు ఇస్తున్న సపోర్ట్ వల్లే వరుసగా సినిమాలు చేస్తున్నాను. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేస్తున్న నిర్మాతలు ఏఎం రత్నం, కెకె రాధమోహన్, చిట్టూరి శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
[ad_2]