[ad_1]
అనకాపల్లిలో జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్‌కు మాత్రమే కాదని... స్టీల్ సిటీ నిర్మాణం కోసమని సీఎం చంద్రబాబు తెలిపారు. అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం చాలా మంచి పరిణామమని.. అనకాపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెట్టడానికి ఈ స్టీల్ ప్లాంట్ ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు నాయుడు అనే నేను చెబుతున్నా... పరిశ్రమలకు ఏపీనే బెస్ట్ ప్లేస్ అంటూ సీఎం ప్రకటించారు. సోమవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు శంకుస్థాపన ఘనంగా జరిగింది. కేంద్రమంత్రి హెచ్డి కుమార స్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ సంస్థకు చెందిన ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుపస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...''20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును శంకుస్థాపన చేసుకున్నాం. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా లక్షమంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాజెక్టు రావడానికి కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్‌ను అభినందిస్తున్నా. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు. రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సంస్థకు జాతీయ స్థాయిలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచి పేరు వచ్చింది.
ఇలాంటి సంస్థ ఏపీకి రావడం చాలా మంచి పరిణామం. అందుకే చెబుతున్నాను... ఇవాళ జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే కాదు... స్టీల్ సిటీకి జరిగిన శంకుస్థాపన. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతుంది. 2028 నాటికి ప్లాంట్‌లో మొదటి దశ ఉత్పత్తిని రూపొందించారు. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ సెన్, డిసెంబరు ఫర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేయబడుతుంది. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లెన్ల రహదారి కూడా పూర్తి అవుతుంది. పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ కూడా వేయబోతున్నారు. ఈ ప్లాంట్ కోసం పైప్ లైన్ వేయాలని ప్రధానిని కోరితే వెంటనే అంగీకరించారు. ఉక్కు ఉత్పత్తి ఒక్కటే కాదు ఆర్థిక లావాదేవీలతో విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపురేఖలు మారతాయి” అని సీఎం చంద్రబాబు చెప్పారు.
అనుమతులు వేగంగా ఇస్తాం... అదే వేగంతో అభివృద్ధి చేయండి
“ఈ పరిశ్రమకు ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులను ఒక్క ఏపీలోనే ఇచ్చాం. చంద్రబాబు అను నేను చెబుతున్నాను... దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం, రాష్ట్రం ఉంది. నిపుణులు, మానవ వనరులను ఏపీకి మాత్రమే సొంతం. టూరిజం నుంచి డేటా సెంటర్, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీరంగం వరకూ అన్నింటిలోనూ ఏపీలో మెండైన కుటుంబ అవకాశాలు ఉన్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది.
15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావటం దేశంలో ఇదే తొలిసారి. బీపీసీఎల్ సహా పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లోనే రాష్ట్రానికి 20.35 లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. విశాఖ ఎకనామిక్ రీజియన్ నాలెడ్జి ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ సెంటర్లు ఇలా కీలకమైన కేంద్రంగా విశాఖ మారుతోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి. రేర్ ఎర్త్ మినరల్ హబ్‌గా ఉత్తరాంధ్ర మారుతుంది. పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ద్వారా అందిస్తాం. కొత్తగా పోర్టులు, ఎయిర్ పోర్టులు వస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తాం. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకునేందుకు సహకారం ఇస్తాం. ఈ పరిశ్రమ నిర్మాణంలో రైతులు తమ భూములను త్యాగం చేశారు. వారికి సహకారం అందించాలి. ఉక్కు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ లెన్స్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మొదటిగా అనకాపల్లి జిల్లా యువతకు ఈ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలి. ఆవిష్కరణల కోసం మెటలర్జీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు” అని ముఖ్యమంత్రి అన్నారు.
అభివృద్ధి చెప్పాం... చేసి చూపిస్తున్నాం
“ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైంది. రాష్ట్రంపై ప్రధాని అభిమానానికి ఈ వేదిక పైనుంచి మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నా.. ప్రధాని మోదీ చెప్పిన చిప్ టు షిప్ తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక. ఏ పని తలపెట్టినా పవన్ కళ్యాణ్‌ను అభినందిస్తున్నా.. మంత్రి లోకేష్ పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.
నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఒప్పందం
యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో రెండు ఒప్పందాలు ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ సంస్థ చేసుకున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు నైపుణ్యాలు కల్పించేలా ఒక ఒప్పందం, ఆధునిక ఉత్పత్తి సామర్ధ్యాలపై సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు మరో ఒప్పందం కుదుర్చుకుంది. అత్యాధునిక మెటలర్జికల్ ఇనిస్టిట్యూట్ ద్వారా యువతకు మెరుగైన నైపుణ్యం, తయారీ సామర్ధ్యాలను కల్పిస్తామని ఆర్సెలార్ మిట్టల్ -నిప్పన్ స్టీల్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ ప్రకటన.
ఎక్స్ పీరియన్స్ జోన్ సందర్శన
శంకుస్థాపన ముందు అదే ప్రాగంణంలో ఏర్పాటు చేసిన ఎక్స్ పీరియన్స్ జోన్‌ను ముఖ్యమంత్రి సందర్శించారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎక్స్ పీరియన్స్ జోన్ ను సందర్శించారు. AM-NS ఇండియా ప్లాంట్‌కు సంబంధించిన వివరాలు, ఉక్కు రంగంలో AM-NS ఇండియా సంస్థ ప్రగతి వంటి వాటిని ప్రదర్శించిన వీడియోలను తిలకించారు.
దశల వారీగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ మీనియేచర్ ను సీఎం, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎం, మంత్రులు తిలకించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, టీజీ, అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి జిల్లా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆర్సెలార్ మిట్టర్ ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఆర్సెలార్ ఆదివాసీ బీజేపీ, జరిగింది.
[ad_2]