[ad_1]
మెయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురిని పోలీసు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను పోలీసు కస్టడీకి కోరుతూ దాఖలైన పిటిషన్ పై కోర్టు సోమవారం (మార్చి 23) తీర్పు వెలువరించింది. కాగా ఈ కేసులో రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను విచారిస్తే మరికొందరి పేర్లు తెర మీదకు వస్తాయని దర్యాప్తు అధికారులు.
ఇలా ఉండగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ పలు కీలక విషయాలను గుర్తించారు. రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేశాడనీ, అలాగే రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఇప్పటి వరకు 24 సార్లు పార్టీలు జరిగినట్లు కూడా గుర్తించింది.
ఆయా పార్టీలలో ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరైనట్లు భావిస్తున్నట్లు సిట్.. ఎవరెవరు ఆ పార్టీలకు హాజరయ్యారనే సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఫామ్ హౌస్ సహా చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు డ్రగ్ పార్టీ సందర్బంగా పోలీసులపై కాల్పులు జరిపిన ఢిల్లీకి చెందిన నమిత్ శర్మను షార్ప్ షూటర్‌గా దర్యాప్తు బృందం గుర్తించింది.
అతడికి ఢిల్లీ, పంజాబ్ కేంద్రంగా పని చేస్తున్న అంతర్జాతీయ ఫియాతో సంబంధం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై నిర్ధారణకు సిట్ దర్యాప్తు బృందాలను ఢిల్లీ, పంజాబ్‌లకు పంపినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. విచారణ బృందాలను ఆయా ప్రాంతాలకు పంపించింది.
[ad_2]