[ad_1]
ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం. అంతర్జాతీయ రాజకీయాలలో ఆమెది అందె వేసిన చెయ్యి. యుద్ధ సమయాలలో ఆమె వేసిన అడుగులు విప్లవాత్మకం. ఇక పేదల పాలిట ఆమె పెన్నిది. జనం ఆప్యాయంగా ఆమెను ఇందిరమ్మ అని పిలుచుకున్నారు. గరీబీహఠావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలనకు నడుంబిగించారు.
ఇందిరాగాంధీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. యావత్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు. దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ.
ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం. అంతర్జాతీయ రాజకీయాలలో ఆమెది అందె వేసిన చెయ్యి. యుద్ధ సమయాలలో ఆమె వేసిన అడుగులు విప్లవాత్మకం. ఇక పేదల పాలిట ఆమె పెన్నిది. జనం ఆప్యాయంగా ఆమెను ఇందిరమ్మ అని పిలుచుకున్నారు. గరీబీహఠావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలనకు నడుంబిగించారు. బ్యాంకింగ్ రంగాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు వచ్చేలా వాటిని జాతీయం చేశారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి విజయం సాధించారు. ఆ సందర్భంగా ఆమెను ప్రత్యర్థులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు. వాజ్ పేయి అయితే ఇందిరాగాంధీని కాళికాదేవితో పోల్చి పొగడ్తల్లో ముంచెత్తారు. అలాగే రాజభరణాలను రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి భారత్ అణుశక్తి దేశంగా అవతరించడానికి దోహదపడింది. అలాగే ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని సమూలంగా అణచివేయడానికి ఆపరేషన్ బ్లూస్టార్ జరిగింది.
అయితే ఎంతటి మనిషికైనా జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. దేశంలో ఎమర్జెన్సీ తరువాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ తరువాత ఆమె రాజకీయంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో పడ్డారు. ప్రత్యర్థుల ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఆమె బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కనీసం కోర్టు ఖర్చులకు కూడా డబ్బులేని పరిస్థితిని ఇందిరాగాంధీ ఎదుర్కొన్నారు. దేశంలోనే తిరుగులేని నాయకురాలుగా ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా అని మన్ననలు అందుకున్న ఇందిరాగాంధీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది.
ఆ సమయంలో పని మీద ఇందిరాగాంధీ గారిని కలవడానికి వచ్చిన పి.వి.నరసింహారావును.. “మిస్టర్ పీవీ నాకు కొంచెం అవసరం, సర్దగలరా? అనడంతో.. ఆ తరువాత హిందూపురం ఎంపీ సోమశేఖర్‌కు విషయం చెప్పి బయటకు వచ్చాను.. ఆయన తన వల్ల కాదు ఎల్జీ బాలకృష్ణ కోయంబత్తూరులో రెండు స్పిన్నింగ్ మిల్స్‌ను సాగించారట.
సోమ శేఖర్ బాలకృష్ణను కలిసి విషయం చెప్పగానే.. క్షణం ఆలోచించకుండా అంత గొప్ప నాయకురాలు అడిగితే కాదనడం ఏమిటి అంటూ వెంటనే రెండు ట్రంకు పెట్టేల్లో కోటి రూపాయలు నింపి పంపించారట. అప్పట్లో వందరూపాయల నోటే పెద్దది. అటువంటి వందరూపాయల నోట్లను కట్టలు కట్టి రెండు ట్రంక్ పెట్టెల్లో నింపి ఇద్దరు మనుషులను తోడిచ్చి మరీ ట్రైన్ ఎక్కించారట. ఆ సొమ్ము అలా పీవీ నరసింహరావు ద్వారా ఇందిరాగాంధీకి చేరింది. ఎవరిచ్చారు అని అడిగితే పీవీ ఎల్జీబాలకృష్ణ పేరు చెప్పారు. ఇందిరాగాంధీ ఆ పేరు నోట్ చేసుకున్నారట. సాధారణంగా అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ అంతటి గొప్ప వ్యక్తి అడిగితే ఇవ్వడం, ఆ తరువాత ఆ విషయం మరుగున పడిపోవడం జరుగుతుంది. కానీ ఇందిరాగాంధీ వ్యక్తిత్వం అలాంటిది కాదు.
1980 ఎన్నికలలో ఇందిరాగాంధీ వ్యతిరేక కాంగ్రెస్ అద్భుత విజయం. ఆమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి తనను కష్టకాలంలో ఆదుకున్న బాలకృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన కారులో ప్రమాణ స్వీకార వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎల్జీ బాలకృష్ణకుప్రత్యేక ఆసనం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత తన ఇంటికి తీసుకువెళ్లి ఆయనతో కలిసి భోజనం చేశారు. ఇవేవి మొక్కుబడికి చేసిన మర్యాదలు కావు. దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి, మనస్ఫూర్తిగా చేసిన మర్యాదలు. మూడేళ్ల కిందట ఎల్జీ బాలకృష్ణ తనకు కష్టపడి సాయాన్ని మరిచిపోకుండా ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు ఇందిరాగాంధీ. ప్రధాని హోదాలో ఉన్న ఇందిరా గాంధీకి హాయ్ చెప్పి, షేక్ హ్యాండిచ్చి ఊరుకోవచ్చు. కాదనేవారు ఎవరు? లేదా, వేరొకరికి అప్పచెప్పి, ప్రమాణ స్వీకారంలో ముందు వరుసలో సీటు కేటాయించి, ఓ ఫోటో దిగి వెళ్లిపోవచ్చు. అదే గొప్ప.
కానీ.. ఇందిరాగాంధీ అలా చేయలేదు. గతం గుర్తుంచుకొని స్వయంగా ఆహ్వానించి, తమతోనే తీసు కెళ్ళి ఇంట్లో కలిసి భోం చేయడం, ఆమె ఔన్నత్యానికి ప్రతీక. చేసిన మేలును మరువని హృదయపూర్వక కృతజ్ఞత. అది ఒక గొప్ప జ్ఞాపిక. ఉదయం సాయం చేసిన వారిని సాయంకాలానికే మర్చిపోతున్న ఈ రోజుల్లో పొందిన ఉపకారాన్ని గుర్తుంచుకొని సరైన గుర్తింపు ఇచ్చే వారే నిజమైన నాయకులని నిరూపించిన వాస్తవ ఘటన. ఇందిర వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్నీ నేటి తరం నాయకులు స్ఫూర్తిగా స్ఫూర్తిగా తెలుగువారిని ఆకాంక్షిస్తోంది.
[embed]https://www.youtube.com/watch?v=MCaorgkljqM[/embed]
[ad_2]