[ad_1]
హీరో శర్వానంద్(శర్వానంద్) వైవిధ్యమైన కథలను పాత్రలో ముందుంటాడు. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ అటెంప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా విడుదలైన శర్వానంద్ 'బైకర్' మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. (బైకర్ ట్రైలర్)
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, ఇండియాలో మొట్టమొదటి మోటోక్రాస్ ఫిల్మ్ కావడం విశేషం. యూవీ క్రియేషన్స్ నిర్మాణం ఈ సినిమా, ఏప్రిల్ 3న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్ ప్రారంభం నుండి ముగింపు వరకు అదిరిపోయే విజువల్స్ తో కట్టిపడేసింది. జిబ్రాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ట్రైలర్లో మోటోక్రాస్ రేసింగ్ సీన్లు, మట్టి ఎగురుతుంటే శర్వానంద్ బైక్‌పై చేసే విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. శర్వానంద్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ పాత్రకు చక్కగా సరిపోయాయి. రేసింగ్ ట్రాక్‌పై శర్వానంద్ తన బైక్‌తో చేసే సాహసాలు కన్నుల పండువగా ఉన్నాయి.
కేవలం రేసింగ్ మాత్రమే కాదు, సినిమాలో ఒక బలమైన తండ్రి-కొడుకుల సెంటిమెంట్ కూడా ఉంది ట్రైలర్ లో చూపించారు. ఇందులో శర్వానంద్ తండ్రి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించడం విశేషం. ఆయన పాత్ర సీరియస్ గా రూపొందింది. రాజశేఖర్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కానున్నాయి.
"నువ్వు అందరికంటే ముందు రాలేదు. నీకంటే అందరూ వెనకాల వచ్చారు. దానికీ చాలా తేడా ఉంది" అని శర్వానంద్ తో రాజశేఖర్ చెప్పే డైలాగ్ సినిమాలో కథా వైవిధ్యాన్ని చాటి చెబుతోంది. రేసింగ్ లో కొడుకు ఫస్ట్ వచ్చినా రాజశేఖర్ కి తృప్తి లేదు. మిగిలిన వాళ్ళ కంటే బెటర్ రేసర్ గా కాదు, బెస్ట్ రేసర్ గా తన కొడుకుని చూడాలంటే తాపత్రయం రాజశేఖర్ పాత్రలో కనిపించింది.
తండ్రీకొడుకుల మధ్య సీన్స్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. తన డ్రీమ్ ని, తన కొడుకు ద్వారా తీర్చుకోవాలని చూస్తున్నట్టుగా రాజశేఖర్ పాత్ర కనిపించింది. అందుకే కొడుకు విషయంలో కఠినంగా ఉంటున్నాడనేలా సన్నివేశాలు.
మరోవైపు మాళవిక నాయర్ పాత్ర కూడా చాలా సహజంగా ఉంది. ట్రైలర్ చివరలో వచ్చే రేసింగ్ సీన్స్, ఎమోషనల్ టచ్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఆకట్టుకున్నాయి. ప్రతి ఫ్రేమ్ లోనూ రిచ్ నెస్ వచ్చింది.
మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. 'బైకర్'తో శర్వానంద్ భారీ హిట్ కొట్టడానికి సిద్ధమైపోయాడని అర్థమవుతోంది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
[ad_2]