[ad_1]
జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తన అప్ కమింగ్ మూవీ 'డ్రాగన్'(డ్రాగన్) కోసం చేస్తున్న కసరత్తులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా కోసం ఎన్టీఆర్ తన ఫిజిక్‌ను పూర్తిగా మార్చేశాడు.
ఈ సినిమాలోని పాత్ర డిమాండ్‌తో అత్యంత సన్నగా, ఫిట్‌గా కనిపించేందుకు ఎన్టీఆర్ కఠినమైన ఫిట్నెస్ నియమాలను అనుసరించాడు. తన ట్రైనర్స్ పర్యవేక్షణలో రోజుకు 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్, క్రమశిక్షణతో కూడిన డైట్ ప్లాన్‌ను ఫాలో అయ్యాడు. కేవలం ఏడు వారాల వ్యవధిలోనే 10 కిలోల బరువు తగ్గడం వెనుక ఎన్టీఆర్ పడిన శ్రమ అసమాన్యమని చెప్పవచ్చు.
సినిమా సినిమాకు ఎన్టీఆర్ తన బాడీ మేకోవర్లతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. 'టెంపర్' కోసం తొలిసారి సిక్స్ ప్యాక్‌లో కనిపించాడు. అలాగే 'అరవింద సమేత', 'ఆర్ఆర్ఆర్' సినిమాలలో డిఫరెంట్ ఫిజిక్ తో కనిపించాడు. ఇక ఇప్పుడు 'డ్రాగన్'లో సరికొత్తగా కనిపించనున్నాడు. ఇందులో కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ 'బ్రూస్లీ' తరహా ఫిజిక్‌తో ఎన్టీఆర్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడట. అంటే చూడటానికి స్లిమ్ గా ఉంటూనే, కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడన్నమాట.
ఈ సినిమా షూటింగ్ కి ముందు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ వైరల్ కావడంతో, ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు కాస్త ఆందోళన చెందారు. ఆ తర్వాత సినిమా కోసం ట్రాన్స్ఫర్మేషన్ అని తెలిసి.. ఎన్టీఆర్ డెడికేషన్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ప్రస్తుతం 'డ్రాగన్' మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇటీవలే జోర్డాన్‌లో ఒక కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం, తదుపరి యాక్షన్ సీక్వెన్స్‌లపై దృష్టి పెట్టింది. ఈ భారీ బడ్జెట్ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉంది. అదే రోజు కొత్త విడుదల తేదీపైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
[ad_2]