[ad_1]
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మలయాళ, తమిళ మేకర్స్ తీసే మిస్టరీ థ్రిల్లర్స్ అంటే మన ప్రేక్షకులకు చాలా ఆసక్తి. ఫిబ్రవరి 27న తమిళ థియేటర్లలో విడుదలై ప్రశంసలు అందుకున్న సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'ఫోర్త్ ఫ్లోర్' (నాల్గవ అంతస్తు).. మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసింది.
'ఫోర్ట్ ఫ్లోర్' డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈరోజు(మార్చి 20) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిస్ అయిన వారు, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని ఈ సస్పెన్స్ రైడ్‌ను ఎంజాయ్ ఎంజాయ్ చేయవచ్చు.
ఎల్.ఆర్. సుందరపాండి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బిగ్ బాస్ తమిళ విన్నర్ ఆరి అర్జునన్ ప్రధాన పాత్ర పోషించారు. తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ వల్ల చెన్నై వెళ్లిన హీరో, అక్కడ ఒక అపార్ట్మెంట్లోని ఫోర్త్ ఫ్లోర్లో దిగుతాడు. అప్పటి నుంచి అతనికి ఎదురైన విచిత్రమైన అనుభవాలు, ఆ ఫోర్త్ ఫ్లోర్ వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ ఏమిటన్నదే ఈ సినిమా కథాంశం.
ఆరి అర్జునన్ సినిమాతో పాటు దీప్సిక, పవిత్ర తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కథలో ఉండే సైకలాజికల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను చివరి వరకు సీటు అంచున కూర్చోబెడతారు. ధరణ్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ హారర్ మూడ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని చెప్పవచ్చు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ మూవీ క్లిప్పింగ్స్ వైరల్ అవుతున్నాయి. హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్లో 'ఫోర్ట్ ఫ్లోర్' ఒక బెస్ట్ ఆప్షన్.
ఇది కూడా చదవండి: అప్పుడే ఓటీలోకి వచ్చేసిన శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం'
[ad_2]