[ad_1]
హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ ముఠాల వ్యవహారం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అసలు-నకిలీ తేడా తెలియక వినియోగదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా తక్కువ ధరలకు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పోలీసులు కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కొందరు అక్రమంగా రహస్య ప్రదేశాల్లో నాసిరకం పదార్థాలతో తయారీ కొనసాగిస్తున్నారు. తాజాగా అందరూ ఇష్టపడే పచ్చళ్లను కూడా కుళ్లిన పదార్థాలతో తయారు చేసి, బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అతికించి మార్కెట్లో విక్రయిస్తున్న ఘటన తగ్గుముఖం పట్టింది.
దాడి వివరాలు:
విశ్వసనీయ సమాచారం మేరకు కుల్సుంపురా పోలీసులుయాగూడ ప్రాంతంలోని వెంకటేశ్వర నగర్లో ఉన్న ఒక గోదాముపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పచ్చళ్ల తయారీ జరుగుతున్నట్లు పేర్కొన్నారు. నిందితులు కుళ్లిపోయిన కూరగాయలు, నాణ్యతలేని ముడి పదార్థాలను ఉపయోగించి పచ్చళ్లను తయారు చేసి, స్థానిక వస్తువులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈరోజు బుధవారం 18వ తేదీన కుల్సుంపుర సబ్ఇన్ స్పెక్టర్ ఎం. నరసింహ తన సిబ్బందితో కలిసి జియాగూడ ప్రాంతంలో గస్తీ నిర్వ హిస్తున్న సమయంలో వెంకటేశ్వర నగర్లోని ఓ గోదాములో అనుమానాస్పద కదలికలు గమనించారు.
అక్కడ వెంటనే ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పచ్చళ్ల తయారీ జరుగు తున్నట్లు బయటపడింది. దర్యాప్తులో భాగంగా నిందితులు కుళ్లిపోయిన కూరగాయలు, నాసిరకం ముడి పదార్థాలు ఉపయో గించి పచ్చళ్లను తయారు చేసి, వాటిపై బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు అతికించి స్థానిక వినియోగదారులకు తక్కువ ధరలకు సరఫరా చేస్తున్నారు. ప్రజల నమ్మకంతో కొనుగోలు చేసే పచ్చళ్లే ఇలాంటి పరిస్థితుల్లో తయారవుతున్నాయని తెలిసి స్థానికులు షాక్కు గురయ్యారు. కల్తీ పచ్చళ్ళు తయారు చేయిస్తున్న... జియాగూడ కు చెందిన ఎన్. నరసింహ (54), ఎన్. నరేష్ (45)లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ దాడిలో భారీగా డ్రమ్ములలో నిల్వ ఉంచిన కల్తీ పచ్చళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 72 డ్రమ్ముల నిమ్మకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉసిరి, గోంగూర పచ్చళ్లతో పాటు 6 డ్రమ్ముల టమోటా, చింత పండు పేస్ట్, ఒక డ్రమ్ము అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక ఎలక్ట్రానిక్ బరువు తూచే యంత్రాన్ని సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల తయారీ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని పోలీసులు హెచ్చరించారు. అక్రమంగా నాసిరకం పదార్థాలతో తయారీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అలాగే వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండి, నాణ్యమైన మరియు విశ్వసనీయమైన వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.
[ad_2]