
రెండు దశాబ్దాల క్రితం సినీ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసిన నటి ప్రత్యూష మృతి కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన సిద్ధార్థ్ రెడ్డి కోర్టు ప్రకారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఆయన మీడియా ముందుకు రావడం ఈ కేసును మళ్లీ చర్చనీయాంశంగా మార్చింది.ఈ ఘటన 2002 ఫిబ్రవరి 23న నటి ప్రత్యూష మరియు సిద్ధార్థ్ రెడ్డి కలిసి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తాగినట్లు వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ ప్రత్యూష ప్రాణాలు కోల్పోయింది. అయితే సిద్ధార్థ్ రెడ్డి మాత్రం చికిత్సతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అప్పట్లో సినీ పరిశ్రమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ప్రత్యూష మృతి ఆత్మహత్య కాదని, ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ ఆమె తల్లి ఇన్నేళ్లుగా న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారించిన ట్రయల్ కోర్టు ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సిద్ధార్థ్ రెడ్డికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. హైకోర్టు శిక్షాకాలాన్ని ఐదేళ్ల నుంచి రెండు సంవత్సరాలకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలం పాటు ఈ కేసుపై విచారణ కొనసా గిన తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది. అలాగే నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో కొనసా గుతున్న ప్రత్యూష మృతి కేసు మరోసారి ప్రజల దృష్టిని ఆకర్షించింది.

C.E.O
Cell – 9866017966

