
-క్రైమ్ ఇన్విస్టిగేషన్ చూస్తే మతిపోతుంది
-సరికొత్త సినీ జోష్
-పేరు మీకు తెలుసా!
సినీ ప్రియులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి అంతకు మించి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ అలాంటిది కాదు. మీరు మూవీ చూసిన వెంటనే కథకుడిగా మారిపోయి మీకు అక్కడ ఉన్న వాళ్ళందర్నీ కూర్చోపెట్టి కథని ఎంతో ఇంట్రెస్ట్ తో చెప్తారు. ఆ టైంలో వాళ్లంతా మీతో ‘మూవీ మేము చూస్తాం ఎక్కడ ఉందో చెప్పు అన్నా కూడా ఎక్కడ ఉందో చెప్పకుండా కథ చెప్పడం కంప్లీట్ చేశాకే మీరు అసలు విషయం చెప్తారు. అంత స్వార్థం ఈ మూవీ చూసిన తర్వాత మీకు వస్తుంది. మరి ఆ మూవీ ఏంటో చూద్దాం.
‘విలంగు'(విలంగు). తమిళంలో ప్రదర్శించిన పక్కా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. మొత్తం ఏడు ఎపిసోడ్లు. ప్రతి ఎపిసోడ్ మన ఊహకి అందని విదంగా ఉంటుంది. ఊహించని విధంగా ప్రవర్తించే క్యారెక్టర్స్ తో పాటు సన్నివేశాల్లోని టెన్షన్ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీంతో క్రైమ్ థ్రిల్లర్ ని ఇష్టపడే ప్రేక్షకులు ‘విలంగు’ దగ్గర వాలిపోతున్నారు. రిపీట్ ఆడియన్స్ ని కూడా సొంతం చేసుకుంటుంది. అందుకే iMDb లో 7.9 రేటింగ్ ఉంది. 2022లో రిలీజ్ అయినా ఆ స్థాయి రేటింగ్ తో కొనసాగడం విశేషం. జీ 5(Zee 5)లో అందుబాటులో ఉంది. ఇంకో ఆనందకరమైన విషయం ఏంటంటే తెలుగు లాంగ్వేజ్ లోను ఉండటం విశేషం. టైటిల్ సంకెళ్లు(సంకెల్లు). సాగతీత లేకుండా చాలా వేగంగా సాగే స్క్రీన్ ప్లే అతి పెద్ద ప్లస్ పాయింట్. మరి ఆలస్యం చేయకుండా జీ 5 లోకి వెళ్లిపోండి.
కూడా చదవండి: వారణాసి: వారణాసి టీంకి షాక్! అక్రమం అని తేల్చి ప్రముఖ నటుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
కథ చూసుకుంటే తమిళనాడులోని వెంబూర్ అనే పోలీస్ స్టేషన్ చుట్టు స్టోరీ నడుస్తుంది. ఇళంపరిధి అనే పేరుగల పోలీస్ ఆఫీసర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. పర్సనల్ ఇష్యూస్ వల్ల సెలవు అనుకుంటే అదే టైమ్‌లో ఒక మర్డర్ కేసు వస్తుంది. దాంతో మర్డర్ కేసుని సాల్వ్ చేసి సెలవు తీసుకోవాలనుకుంటాడు. కానీ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న కొద్ది ఇంకా క్రిటికల్‌గా, కన్ఫ్యూజింగ్‌గా మారుతుంది. ఒక వైపు పర్సనల్ ఇష్యూస్, మరోవైపు క్రిటికల్‌గా మారుతున్న మర్డర్ కేసు. చివరికి హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? అసలు ఆ హంతకుడు మర్డర్ ఎందుకు చేశాడు? అనేవి ఎంతో ఉత్కంఠతతో సాగుతాయి. విమల్, ఇనేయ, బాల శరవణన్, మునిషకాంత్ కారణంగా ముఖ్యమైన క్యారెక్టర్స్ పోషించిన ప్రశాంత్ పాండియరాజ్(prashanth pandiraj) దర్శకుడు.

C.E.O
Cell – 9866017966


