[ad_1]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భవిష్యత్ లో ముఖ్యమంత్రి అయినా అవ్వచ్చు అంటూ నటుడు పార్దీబన్ వ్యాఖ్యలకు అందరూ చప్పట్లు చరుస్తూ.. ఈళలు వేస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం ఒకింత సీరియస్ గా ముఖం పెట్టారు. ఒకింత అసహనంగా కూడా కనిపించారు. దీనితో పార్దీబన్ వ్యాఖ్యల ఔచిత్యంపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది.
వాస్తవానికి పవన్ కల్యాణ్ ప్రస్తుతం కూటమి ఐక్యత, పటిష్ఠతపై పూర్తిగా దృష్టి సారించారు. మరో దశాబ్దన్నర పాటు కూటమి ప్రభుత్వం ఇలాగే ఉండాలని, గట్టిగా చెబుతున్నారాయన. అభివృద్ధి రాష్ట్ర నిరాటంకంగా కొనసాగాలంటే కూటమి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం.. అంటే పదవులు ముఖ్యం కాదు.. రాష్ట్రాభివృద్ది మరింత ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రగతి, పురోగతే లక్ష్యం అన్నది ఆయన ఇన్ టెన్షన్. కాగా ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ రాష్ట్రంలోని అధికార కూటమిలో భాగస్వామి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ ఉన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ధర్మానికి విరుద్ధంగా తనకు సీఎం కూటమిగా అనిపించేందుకు పవన్ కల్యాణ్ ఇసుమంతైనా సుముఖత చూపడం లేదు. అయితే సినిమా ఫంక్షన్లలో, సభలలోనూ, పార్టీ సమావేశాల్లోనూ వక్త.. పవన్ కల్యాణ్ సీఎం అంటూ చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన అసహనానికి గురౌతున్నట్లు. అలాంటి వారికి మనం ఏం చెప్పాలి? అన్న నిర్వేదం పార్దీబన్ వ్యాఖ్యల సమయంలో పవ’న్ మొహంలో ప్రస్ఫుటంగా కనిపించింది.
కేవలం పార్దీపన్ అంటే కాదు.. హిందుత్వ విషయంలో పవన్ ని తీవ్రంగా వ్యతిరేకించే సత్య రాజ్ కూడా ఎన్టీఆర్ తర్వాత తెలుగులో అంతగా సక్సెస్ అయిన పొలిటికల్ హీరో పవన్ కళ్యాణే అంటూ ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలున్నాయి. అయితే వీటనిటినీ జనసేనాని వినీ విననట్టు వదిలేస్తుంటారు. బెంగళూరు వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ నే సీఎం అంటూ అభిమానులు అరుస్తుంటే.. ఇక్కడ ఆంధ్ర నడిబొడ్డున కూర్చొని ఒక ఉప ముఖ్య మంత్రిగా ఉన్న వ్యక్తి గురించి ఆ ఎలివేషన్లు అసాధారణమేమీ కాదంటారు పరిశీలకులు. భవిష్యత్ సంగతి పక్కన పెడితే.. ఈ టరమ్ లోనే లోకేష్ సీఎం కాబోతున్నార’న్న చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప’వ’న్ సీఎం ఎవరెవరో చేస్తున్న వ్యాఖ్యలకు అర్ధం లేదంటున్నారు.
ఏది ఏమైనా పవన్ కల్యాణ్ ను మాత్రం సీఎం పదవి ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తోంది. ఆడలా ఉంచితే.. రాష్ట్రంతో ఏ మాత్రం సంబంధం లేని, రాష్ట్ర రాజకీయాలతో ఇసుమంతైనా పరిచయం లేని పార్దీబన్ వంటి నటులు పవన్ కల్యాణ్ సీఎం అవుతారంటూ చేస్తున్న వ్యాఖ్యల వెనుక ఎవరున్నారన్నది ప్రశ్నార్ధకం. పవన్ కల్యాణ్ ఒక పక్క జనసేన 15 ఏళ్ల పాటు కూటమిలోనే ఉన్నట్లు సందేహాలకు అతీతంగా ఉన్నారు. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసే ఉంటాయని కుండబద్దలు కొడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి పీఠం తెలుగుదేశం ఖాతాలోనే ఉందని ఆయన చెప్పకనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన అభిమానులు నిరాశ చెందకుండా ఉండేందుకు పవన్ కల్యాణే స్వయంగా రాష్ట్రంతో సంబంధం లేని తమిళనటులతో పవన్ సీఎం అన్న మాట అనిపిస్తున్నారా? అంటూ కొందరు డౌటనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి.. పవన్ సీఎం అంటూ పార్దీబన్ వంటి తమిళనటుల కామెంట్ల వ్యవహారం ఎంత కాలం కొనసాగుతుందో?
[ad_2]