
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయనకు ఆదేశాలు జారీ చేశారు.ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సూచించారు. అలాగే మహేశ్‌కు నోటీసులు కూడా ఇవ్వబడ్డాయి. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
నేతల బలహీనతలు, తప్పిదాల వల్ల పార్టీకి నష్టం కలగకుండా చూస్తామని ఆయన తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ ప్రమేయంపై ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రధాన నిందితులతో ఆయనకు ఉన్న సంబంధాలు, డ్రగ్స్ పార్టీలు, ఇతర లావాదేవీలపై అధికారులు ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఎంపీకి ఉన్న అనుబంధాలపై లోతైన విచారణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు

C.E.O
Cell – 9866017966
.webp)
