[ad_1]
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ"(కపుల్ ఫ్రెండ్లీ) ఓటిటిలోనూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన కపుల్ ఫ్రెండ్లీ మూవీ మంచి వసూళ్లతో సత్తా చాటింది. ఇప్పుడు ఓటీలోనూ బ్లాక్ బస్టర్ అందుకుంది. సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక మంచి మూవీ చేశారంటూ యూత్ సోషల్ మీడియాలో చాలా అప్రిషియేట్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా బాగుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా మూవీకి బాగా మైలేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు కపుల్ ఫ్రెండ్లీ మూవీని అప్రిషియేట్ చేస్తూ పోస్ట్ లు చేస్తున్నారు.
"కపుల్ ఫ్రెండ్లీ" ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మించింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
[ad_2]