
ఏజెన్సీ అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పాడేరు నియోజకవర్గం నందిగరువు గ్రామంలో శనివారం నిర్వహించిన ‘గిరిజనులతో మాటామంతి’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జనసేన పార్టీఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ‘డోలి మోత’లతో ఇబ్బందులు పడుతున్న మారుమూల గ్రామం నుంచి మార్పు మొదలు కావాలని, అందుకే ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం రాత్రికి రాత్రే కావని, కానీ పరిష్కరించేందుకు సంకల్పం ఉందని. ప్రధానమంత్రి నిధులతోనే ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం సాధ్యమైందని, వైసీపీ ప్రభుత్వంలో ఈ నిధులు ఏమయ్యాయో మీరు నాయకులను నిలదీయాలని కోరారు.
నందిగరువు గ్రామస్తుల విన్నపం కొత్త పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, 1.6లో మేర నూతన రోడ్డు నిర్మాణంతో పాటు గ్రామంలో మ్యాజిక్ డ్రైన్‌లు అందించబడ్డాయి. అలాగే, సుమారు 3 వేల గ్రామాలకు తాగు నీరు అందించే బృహత్తర సమయంలో చేపట్టబోతున్నట్లు డిప్యూటీ సీఎం. గిరిజన ప్రాంతాల ఉపాధికి కీలకమైన జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

C.E.O
Cell – 9866017966

.webp)


