
ఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా ఆ భారాన్ని ప్రయాణికులపై మోపుతున్నాయి. ఇప్పటికే ఎయిరిండియా, ఇండిగో కంపెనీ టికెట్ ధరపై ఇంధన సర్ఛార్జీ విధించింది. తాజాగా ఆకాశ ఎయిర్ సైతం టిక్కెట్ల ధరలను పెంచుతున్నట్టు శనివారం (14-3-26 నుంచి) ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావమే ఈ పెరుగుదలకు కారణం. తాజాగా ఆకాశ ఎయిర్ దేశవాళీ, అంతర్జాతీయ రూట్లలో రూ.199నుంచి రూ.1,300 వరకు సర్‌ఛార్జీలను విధిస్తున్నట్టు.
మార్చి 15వ తేదీ నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వర్జీకి అవకాశం ఉంది. మార్చి 15వ తేదీ అర్ధరాత్రి 12.01 గంటలకు ముందు బుకింగ్ చేసుకున్న వారికి ఇది వర్తించదు. సెక్టార్, విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఫ్యూయెల్ సర్‌ఛార్జి ఉంటుందని ఆకాశ్ ఎయిర్ ప్రసారం చేస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా ఫ్యూయెల్ సర్‌ఛార్జీలను సమీక్షిస్తుంది. ఇండియన్ ఏవియేషన్ మార్కెట్ షేర్ సుమారు 5 శాతం ఉన్న ఆకాశ్ ఎయిర్ సుమారు రెండు దేశీయ గమ్యస్థానాలు, కువైట్, దోహా, జెడ్డా, రియాద్, అబుదాబి సహా మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియా అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను నడుపుతోంది.

C.E.O
Cell – 9866017966

