[ad_1]
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్ర వేశారు సముద్రఖని(సముతిరకని). విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యారు. 'విమానం' వంటి సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో మరో సినిమా రాబోతుంది. అదే 'కార్మేని సెల్వం'(Carmeni Selvam).
పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ద్విభాషా చిత్రం 'కార్మేని సెల్వం'. సముద్రఖని ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మీ ప్రియ, అభినయ, కార్తిక్ కుమార్, బడ గోపీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.
'కార్మేని సెల్వం' సినిమా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకోగా.. రీసెంట్ విడుదలైన టీజర్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది.
"డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ సినిమాపై క్యూరియాసిటిని పెంచుతుంది. అధిక ఖర్చులు, లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు వంటి వివిధ కోణాల్లో చూపిస్తూ నేటి సమాజంలో డబ్బు ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంది.
ముఖ్యంగా ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ ఆధారిత జీవనశైలి, డబ్బు కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థమవుతుంది. ఓ వైపు సముద్రఖని కుటుంబంతో కనిపించే సన్నివేశాలు, విదేశాల్లో ఒంటరిగా కనిపించే కొన్ని షాట్లు కథపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
చివర్లో “ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడిలా బతకడం నేర్చుకోవాలి.. లెక్క లేకుండా ఖర్చు పెట్టండి.. డబ్బు లేకపోతే అప్పు చేసి ఖర్చు పెట్టండి” అని సముద్రఖని చెప్పే డైలాగ్ ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తించేలా ఉంది.
ప్రస్తుతం ఈ టీజర్ లోని డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటి సమాజం డబ్బు చుట్టూ ఎలా తిరుగుతుంది అనేది మంచి ఎమోషనల్ రైడ్ లా చూపించబోతున్నారని టీజర్ తో స్పష్టమైంది.
[embed]https://www.youtube.com/watch?v=z2DAJF-IhW8[/embed]
[ad_2]