Home Latest News పాడైపొయిన డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ | పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్| హైదరాబాద్ పోలీస్| అసవ మనీష్| చార్మినార్| సీఎం రేవంత్ రెడ్డి – Jananethram News

పాడైపొయిన డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ | పాడైపోయిన డ్రై ఫ్రూట్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్| హైదరాబాద్ పోలీస్| అసవ మనీష్| చార్మినార్| సీఎం రేవంత్ రెడ్డి – Jananethram News

by Jananethram News
0 comments
news-logo


ఆరోగ్యాన్ని కాపాడుకోవడ నికి చాలా మంది రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను భాగం చేసుకుంటున్నారు. అయితే ఈ అవసరాన్ని కొందరు కేటుగాళ్లు దుర్వినియోగం చేస్తూ పాడైపోయిన డ్రై ఫ్రూట్స్‌ను నాణ్యమైనవిగా నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రోజురోజుకీ కల్తీ ఆహార పదార్థాల వ్యవహారం పెరుగుతుండడంతో అసలు ఏది, నకిలీ ఏది అన్నది గుర్తించడం ప్రజలకు కష్టంగా మారింది. కొంతమంది దొంగ వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి అక్రమ వ్యాపారాలు చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇలాంటి నకిలీ వ్యాపారాలపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ సిటీ సీసీఎస్ (డీడీ) స్పెషల్ క్రైమ్ టీమ్, ఫుడ్ అడల్టరేషన్ టీమ్ మరియు బహదూర్‌పురా పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా పాడైపోయిన మరియు అపరిశుభ్రమైన డ్రై ఫ్రూట్స్‌ను నాణ్యమైనవిగా నమ్మించి ప్రజలకు విక్ర యిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసవా మనీష్ (42) అనే వ్యక్తి చార్మినార్ ప్రాంతంలోని చలాపురాలో “GEM ఫుడ్స్ (దిగుమతులు మరియు ఎగుమతులు)” పేరుతో ఒక గోదామును నిర్వహిస్తున్నాడు. కావాలనే పాడైపో యిన, బూజు పట్టిన మరియు దుర్వాసన వస్తున్న డ్రై ఫ్రూట్స్‌ను సేకరించి వాటిని నాణ్యమై నవీగా మార్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. . సమాచారం రావడంతో దాడులు చేసి మనీష్‌ను అరెస్టు చేసి అతని వద్ద 30 కార్టన్ బాక్సుల్లో పాడైపోయిన, అపరిశుభ్రమైన డ్రై ఫ్రూట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజలకు సూచన

ఆహార పదార్థాలు, ముఖ్యంగా ప్యాక్ చేసిన వస్తువులు లేదా డ్రై ఫ్రూట్స్ కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వస్తువులను కొనుగోలు చేసే ముందు వాటి నాణ్యత, వాసన, రూపాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరైనా పాడైపోయిన లేదా కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్నట్లు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా ఆహార భద్రతా అధికారులకు అందించాలని.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird