
కోలీవుడ్ స్టార్ ధనుష్(ధనుష్) వరుస సినిమాలతో ఫుల్ గా ఉన్నాడు. ఇప్పటికే విఘ్నేష్ రాజా దర్శకత్వంలో ‘కర’ అనే సినిమా పూర్తి చేశాడు. ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇళయరాజా బయోపిక్, అబ్దుల్ కలాం బయోపిక్ లైన్ లో ఉన్నాయి. అలాగే, ‘లబ్బర్ పండు’ ఫేమ్ తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ తన 56వ సినిమా చేయబోతున్నాడు.
ప్రస్తుతం సాయి పల్లవి, శ్రీలీల వంటి స్టార్ హీరోయిన్లతో నటిస్తున్న ధనుష్, తన తదుపరి సినిమా ‘D56’ కోసం మరో క్రేజీ హీరోయిన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘సప్త సాగరాలు దాటి’, ‘కాంతార’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి వసంత్, ధనుష్ సరసన హీరోయిన్గా నటించబోతోందట. (రుక్మిణి వసంత్)
తనదైన నటన, అందంతో ఇప్పటికే సౌత్ ఇండియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది రుక్మిణి. ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘డ్రాగన్’, యశ్ తో ‘టాక్సిక్’ వంటి భారీ సినిమాలు రూపొందుతున్నాయి. ఇక ఇప్పుడు ధనుష్‌తో జత కడుతుందన్న వార్త ఆసక్తికరంగా మారింది. తమిళ్ లో ఇప్పటికే ‘ఏస్, మదరాసి’ వంటి సినిమాలు చేసింది రుక్మిణి. ఇది ఆమెకు మూడో తమిళ చిత్రం.
ఇది కూడా చదవండి: ఎంజీఆర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్!

C.E.O
Cell – 9866017966


