[ad_1]
ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో భారత్ కు చెందిన వ్యాపార దిగ్గజాలకు చోటుదక్కింది. అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబాని తన దేశంలో పదిలం చేసుకున్నారు. కాగా ఈ సారి దేశంలో సంపన్నుల జాబితాలో తొలి పది స్థానాల్లో ఎవరున్నారని చూస్తే.. అగ్రస్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీ ఉండగా, ఆ తర్వాత స్థానంలో ఆదానీ గ్రూప్ గౌతమ్ అదానీ నిలిచారు. ఈ తరువాతి స్థానాల్లో వరుసగా ఓపీ జిందాల్ గ్రూప్, నవీన్ మిట్టల్, శివ్ నాడార్, రాధాకిషన్ దమానీ, దిలీప్ సంఘ్వీ, సైరస్ పూనావాలా, లక్ష్మీ మిట్టల్, కుమార్ మంగళం బిర్లా నిలిచారు.
ఈ వ్యాపారవేత్తల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఉండగా, టెక్నాలజీ, ఫార్మా, టెలికాం, మైనింగ్, స్టీల్ వంటి విభిన్న రంగాల్లో తమ వ్యాపారాలను విస్తరించి ప్రపంచ స్థాయిలో విజయాన్ని సాధించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బిలియనీర్లు ఎవరిని చూస్తే.. టాప్ ఫోర్ లో దివీస్ లాబొరేటరీస్ అధినేత దివి మురళి, అరబిందో ఫార్మా అధినేత పీవీ రాంప్రసాద్ రెడ్డి, మేఘా ఇంజినీరింగ్ కు చెందిన పి. పిచ్చిరెడ్డి, జీవీకే గ్రూప్ అధినేత జీవీ కృష్ణారెడ్డిలు ఉన్నారు.
గత కొన్నేళ్లుగా భారతదేశంలో స్టార్టప్‌లు, టెక్నాలజీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు వేగంగా అభివృద్ధి చెందాయి. దీంతో భారతీయ వ్యాపారవేత్తల సంపద ప్రపంచ స్థాయిలో పెరుగుతోంది. ఫోర్బ్స్ జాబితాలో భారతదేశానికి చెందిన బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగింది. గత ఏడాది ఫోర్బ్స్ జాబితాలో దేశం నుంచి 205 మంది కుబేరులు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 229కి పెరిగింది.
[ad_2]