Home సినిమా రష్మికపై జరుగుతున్న అసత్య ప్రచారం ఇదే.. విజయ్ దేవరకొండ స్పందన చూడాలి – Swen Daily

రష్మికపై జరుగుతున్న అసత్య ప్రచారం ఇదే.. విజయ్ దేవరకొండ స్పందన చూడాలి – Swen Daily

by
0 comments
tmdb-header-middle-logo



-రష్మిక పై సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది
-ఆ ప్రచారాన్ని ఎవరు చేస్తారు
-ట్వీట్ లో ఏముంది
-స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్న రష్మిక

ఏ తెలుగు చిత్ర పరిశ్రమ అయితే తనకి స్టార్ స్టేటస్ ని కట్టబెట్టిందో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ని పెళ్లి చేసుకొని ఇప్పుడు రష్మిక మందన్న(Rashmika Mandanna)తెలుగింటి కోడలుగా మారింది. దీనితో తన సినీ, వ్యక్తిగత జీవితంపై తెలుగువారి ఫోకస్ ఎక్కువ అయ్యిందని చెప్పవచ్చు.ఈ విధంగానే రీసెంట్ గా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో టాప్ చైర్ లో కూర్చుంది. ఆ ట్వీట్ లో ఏముందో చూద్దాం.

రష్మిక తన ట్వీట్‌లో గత ఎనిమిదేళ్లుగా నాపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు, వేధింపులు కొనసాగుతున్నాయి.కొంతమంది,మీడియా వ్యక్తులు నేను మాట్లాడిన మాటలని సందర్భం నుంచి వేరుచేసి నేను ఎప్పుడు పలకని విషయాలని తప్పుడు కథనాలుగా ప్రచారం చేస్తున్నారు. వీక్షణలు, రీచ్ కోసం ద్వేషాన్ని ప్రోత్సహిస్తూ దాడులు చేయడమే వాళ్ళ పని. గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణకు సంబంధించిన వ్యక్తుల అనుమతి లేకుండా రికార్డ్ చేయడమే కాకుండా దానిలో చిన్న కత్తి రించి వైరల్ చేస్తున్నారు. నా కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఇకపై సహించబోను. వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేయడం ఆపాలి. ప్రతి వ్యక్తికి తన జీవితాన్ని తాను నిర్ణయించుకునే హక్కు ఉంటుంది.

కూడా చదవండి: UStaad Bhagat singh: ఖుషి తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ నే అంట.. లడ్డు అంటున్న నిర్మాత

ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గురించి ప్రచారం అవుతున్న అసత్య కంటెంట్ ని 24 గంటల్లో తొలగించాలి. అలా చేయకపోతే సంబంధిత వ్యక్తులపై పరువునష్టం దావా (డిఫమేషన్ కేసు) వేస్తానని గట్టిగా చెప్పారు.ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఇప్పటివరకు తన ప్రేమతో మద్దతు తెలిపిన అభిమానులకి తన ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపారు. రష్మిక ట్వీట్ పై విజయ్ దేవరకొండ నుంచి ఇంకా స్పందన రాలేదు. మరి అసత్య ప్రచారంపై తను ఎలా సూచించాడో చూడాలి.

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird