
విదేశాల్లో ఉన్న ప్రవాసులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో ఉండగా రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన ప్రవాసులు కొత్త ఎంట్రీ కోసం ఎటువంటి ఇబ్బందులూ లేకుండానే పాత వీసాలతోనే యూఏఈలోకి ఎంటర్ అవ్వడానికి అనుమతి ఇచ్చింది. ఏవో కారణాల వల్ల విదేశాల్లో ఉండి యూఏఈకి తిరిగి రాలేకపోయిన ప్రవాసులు తమ వీసాల గడువు ముగిసిన కొత్త ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. వారు నేరుగా యూఏఈకి తిరిగి వచ్చి తమ వీసా సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసుకునే అవకాశం ఇచ్చింది.
విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రవాసులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశం అనడంలో సందేహం లేదు. యూఏఈ ప్రభుత్వం ప్రవాసుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సడలింపును కల్పించినట్లు అధికారులు తెలియజేసారు. దీంతో ప్రవాసులు తిరిగి దేశంలోకి సులభంగా ప్రవేశించేందుకు యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

C.E.O
Cell – 9866017966

